Categories: ExclusiveNewssports

Virat Kohli : కోహ్లీని విమ‌ర్శించినందుకు ఆ కామెంటేట‌ర్‌ని చంపేస్తామ‌ని బెదిరింపులు..!

Virat Kohli : భార‌త స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అనేక రికార్డులని కొల్ల‌గొట్ట‌డం మ‌నం చూశాం. వ‌న్డే, టెస్ట్‌లు, టీ20లు ఏదైన స‌రే కోహ్లీ త‌న‌కంటూ స్పెష‌ల్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు త‌ర‌పున విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే, సీజన్ ఆరంభంలో కోహ్లీ ఎక్కువ దూకుడుగా క‌న‌బ‌ర‌చిన కోహ్లీ తర్వాత మాత్రం త‌న స్ట్రైక్ రేట్ మెరుగుప‌ర‌చుకొని 154.70తో విమర్శలకు సమాధానాలు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ తక్కువ స్ట్రైక్ రేట్‍తో ఆడుతున్నాడని, ఔట్ అవుతాననే భయంతో దూకుడు చూపడం లేదని ఐపీఎల్‍లో కామెంటేటర్‌గా ఉన్న న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ ఓ సంద‌ర్భంలో అన్నాడు.

Virat Kohli కోహ్లీతో పెట్టుకుంటే అంతే..

అయితే త‌ర్వ‌త త‌న అభిప్రాయాన్ని మార్చుకున్న‌ట్టు సైమ‌న్ తెలియ‌జేశాడు. అయితే కోహ్లీని విమర్శించిన సమయంలో తనను చంపేస్తానంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా బెదిరించారని క్రిక్‍బజ్ కార్యక్రమంలో సైమన్ డౌల్ వెల్లడించాడు. ఔట్ అవడం గురించి కోహ్లీ ఆలోచించకుండా దూకుడుగా ఆడాలనే తాను చెప్పానని ఆయన అన్నాడు. విరాట్ గురించి తాను నెగెటివ్‍గా మాట్లాడడం చాలా అరుదు అని తెలిపాడు. అలా మాట్లాడినందుకే సోష‌ల్ మీడియాలో న‌న్ను బెదిరించారంటూ కామెంట్ చేశాడు సైమ‌న్. నేను విరాట్ కోహ్లీ గురించి వెయ్యి గొప్ప విషయాలు చెప్పా. కానీ ఒకే అంశంలో ప్రతికూలంగా చెప్ప‌డంతో హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఇది సిగ్గు చేటు” అని సైమన్ డౌల్ చెప్పాడు.

Virat Kohli : కోహ్లీని విమ‌ర్శించినందుకు ఆ కామెంటేట‌ర్‌ని చంపేస్తామ‌ని బెదిరింపులు..!

విరాట్ కోహ్లీతో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని సైమన్ డౌల్ స్పష్టం చేశాడు. మ్యాచ్‍లు ముగిసిన తర్వాత చాలాసార్లు తాను, విరాట్ మాట్లాడుకున్నామని తెలిపాడు. ఇక ఆర్సీబీ ఐపీఎల్ నుండి నిష్క్రమించిన తర్వాత విరాట్ కోహ్లీ చిన్న గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే తన విరామం పొడిగించాలని కోహ్లి బీసీసీఐని అభ్యర్థించాడు. బీసీసీఐ కూడా విరాట్ నిర్ణయాన్ని గౌరవించి, కోహ్లీ అమెరికా వెళ్లే తేదీని పొడిగించినట్లు స‌మాచారం అందుతుంది.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

7 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

8 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

10 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

12 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

14 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

16 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

17 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

18 hours ago