Good News : తెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ సర్కార్ త్వరలో మరో శుభవార్త చెప్పనుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ అలాగే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ 6 గ్యారెంటీలలో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రజల చెంతకు చేరుతుండగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చిన రూ.2500 ఆర్థిక సాయం పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ విషయాన్ని ఇటీవల మంత్రి సీతక్క వెల్లడించారు. త్వరలోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ రూ.2500 ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. దీనితోపాటు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు అందించే పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలియజేశారు.
అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ , అలాగే గృహలక్ష్మి స్కీమ్ కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లుగా తెలిపారు. అలాగే మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రానున్న 5 సంవత్సరాలలో దాదాపు లక్ష కోట్ల రుణాలను అందించే దిశగా బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఆమె తెలిపారు.
ఇక ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకులు ఇచ్చే లోన్లను తీసుకుని ఆర్థికంగా ఎదగాలని తెలియజేశారు. దీనితోపాటు ఎస్ హెచ్ జీ బ్యాంకు లింకేజీ వార్షిక రుణ ప్రణాళికలను కూడా తాజాగా మంత్రి సీతక్క విడుదల చేశారు. మహిళా సంఘాల విషయంలో బ్యాంకులు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన విధంగా వారికి లోన్ సదుపాయం కల్పించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుందని మంత్రి సీతక్క తెలియజేశారు.ఈ క్రమంలోనే మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళ శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. దీనిలో భాగంగా త్వరలోనే సెక్రటేరియట్ ,కలెక్టరేట్లు అన్ని ప్రధాన కార్యాలయాలు పర్యటక ప్రాంతాలలో దశలవారీగా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.