Good News : తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త… త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఆర్థిక సాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News : తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త… త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఆర్థిక సాయం…!

 Authored By ramu | The Telugu News | Updated on :17 June 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Good News : తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త... త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఆర్థిక సాయం...!

Good News : తెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ సర్కార్ త్వరలో మరో శుభవార్త చెప్పనుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ అలాగే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ 6 గ్యారెంటీలలో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రజల చెంతకు చేరుతుండగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చిన రూ.2500 ఆర్థిక సాయం పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ విషయాన్ని ఇటీవల మంత్రి సీతక్క వెల్లడించారు. త్వరలోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ రూ.2500 ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. దీనితోపాటు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు అందించే పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలియజేశారు.

అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ , అలాగే గృహలక్ష్మి స్కీమ్ కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లుగా తెలిపారు. అలాగే మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రానున్న 5 సంవత్సరాలలో దాదాపు లక్ష కోట్ల రుణాలను అందించే దిశగా బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఆమె తెలిపారు.

Good News తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ2500 ఆర్థిక సాయం

Good News : తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త… త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఆర్థిక సాయం…!

ఇక ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకులు ఇచ్చే లోన్లను తీసుకుని ఆర్థికంగా ఎదగాలని తెలియజేశారు. దీనితోపాటు ఎస్ హెచ్ జీ బ్యాంకు లింకేజీ వార్షిక రుణ ప్రణాళికలను కూడా తాజాగా మంత్రి సీతక్క విడుదల చేశారు. మహిళా సంఘాల విషయంలో బ్యాంకులు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన విధంగా వారికి లోన్ సదుపాయం కల్పించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుందని మంత్రి సీతక్క తెలియజేశారు.ఈ క్రమంలోనే మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళ శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. దీనిలో భాగంగా త్వరలోనే సెక్రటేరియట్ ,కలెక్టరేట్లు అన్ని ప్రధాన కార్యాలయాలు పర్యటక ప్రాంతాలలో దశలవారీగా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది