Alcohol Drink : వామ్మో.. భార‌త‌దేశంలో ఎక్కువ‌గా మ‌ద్యం తాగే రాష్ట్రం ఇదే.. తెలంగాణ ఎన్నో స్థానం అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Alcohol Drink : వామ్మో.. భార‌త‌దేశంలో ఎక్కువ‌గా మ‌ద్యం తాగే రాష్ట్రం ఇదే.. తెలంగాణ ఎన్నో స్థానం అంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 August 2024,4:51 pm

ప్రధానాంశాలు:

  •  Alcohol Drink : వామ్మో.. భార‌త‌దేశంలో ఎక్కువ‌గా మ‌ద్యం తాగే రాష్ట్రం ఇదే.. తెలంగాణ ఎన్నో స్థానం అంటే..!

Alcohol Drink : మ‌ద్య‌పానం నిషేదించాల‌ని ప‌లువురు ప‌లు ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాను మ‌ద్యం కొనుగోలు మాత్రం విప‌రీతంగా పెరుగుతూ పోతుంది. భారతదేశం లోని చాలా రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. ఇతర రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ అక్కడ కూడా మద్యాన్ని నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే తాజాగా కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ కుటుంబ సంక్షేమంపై ఓ సర్వే ) జ‌ర‌గ‌గా, ఆస‌క్తిక‌ర విష‌యాలు బయ‌ట‌కు వ‌చ్చాయి. దేశంలోని నగరాల్లో నివసించే వారి కంటే గ్రామాల్లో నివసించే వారే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది.

Alcohol Drink తెలంగాణ రెండో రాష్ట్రం..

మద్యం సేవించే వారిని మహిళలు, పురుషులు అనే రెండు గ్రూపులుగా విభజించగా.. 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు 18.7 శాతం, స్త్రీలు 1.3 శాతం మద్యంపానం చేస్తున్నారని తేలింది.రాష్ట్రాల వారీగా విభజించినట్లయితే.. దేశంలో అత్యధిక సంఖ్యలో మద్యం సేవించే వారు ఉన్న రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని సర్వేలో వెల్లడైంది. ఈ రాష్ట్రంలో సుమారు 52.6 శాతం మంది పురుషులు మద్యానికి బానిసలుగా ఉన్నారని తెలుస్తోంది. ఆ తరువాత స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉండగా.. ఇక్కడ సుమారు 43.4 శాతం మంది పురుషులు మద్యానికి బానిసలుగా ఉన్నారు.ఇక మూడో స్థానంలో సిక్కిం 39.9 శాతంతో ఉండగా అండమాన్ 38.8 శాతంతో ఉన్నాయి. తరువాతి స్థానాల్లో మణిపూర్, గోవా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి.

Alcohol Drink వామ్మో భార‌త‌దేశంలో ఎక్కువ‌గా మ‌ద్యం తాగే రాష్ట్రం ఇదే తెలంగాణ ఎన్నో స్థానం అంటే

Alcohol Drink : వామ్మో.. భార‌త‌దేశంలో ఎక్కువ‌గా మ‌ద్యం తాగే రాష్ట్రం ఇదే.. తెలంగాణ ఎన్నో స్థానం అంటే..!

మహిళా తాగుబోతుల జాబితా ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం 24.2 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో సిక్కిం 16.2 శాతం, అస్సాం 7.3 శాతం, తెలంగాణ 6.7 శాతం, జార్ఖండ్ 5.7 శాతం తాగుబోతులు ఉండగా.. తరువాత స్థానాల్లో అండమాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉన్నాయని సర్వే ప్రకారం వెల్లడైంది.త‌క్కువ మ‌ద్యం తాగే రాష్ట్రాల జాబితాలో ల‌క్ష‌దీప్ మొద‌టి స్థానంలో ఉంది. 0.4 శాతం మంది పురుషులు మాత్ర‌మే ఆ రాష్ట్రంలో మ‌ద్యం తాగుతున్నారు. మ‌హిళ‌ల ప‌రంగా చూసుకుంటే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో 24.2 శాతం మంది మ‌ద్యం తాగుతున్నారు.సిక్కిం రాష్ట్రంలో 16.2 శాతం, అస్సాం 7.3 శాతం, తెలంగాణ 6.7 శాతం, జార్ఖండ్ 5.7 శాతం, అండ‌మాన్ 5 శాతం, చ‌త్తీస్ ఘ‌డ్ 4.9 శాతం మంది మ‌హిళలు మందు తాగుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది