
Telangana : తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్.. రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్..!
Telangana : తెలంగాణ సర్కార్ ప్రజలకి ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇకపై తెలంగాణలో అత్యంత చౌకగా ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. టి ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ప్రభుత్వం 300 రూపాయలకే ఇవ్వనుంది. ఈ కనెక్షన్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న టీవీని కంప్యూటర్ మాదిరిగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా టీవీలోనే ప్రత్యేక వెసులబాటును కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 20 ఎంబిబిఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ కనెక్షన్ అందివ్వనుంది ప్రభుత్వం. ఇందులో పలు తెలుగు ఓటీటీలు కూడా అందుబాటులో ఉంటాయి.
Telangana : తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్.. రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్..!
ఈ ప్రాజెక్టు తొలి దశలో తెలంగాణ వ్యాప్తంగా 94 మండలాలు, 2,096 గ్రామ పంచాయతీల్లో కమర్షియల్ సేవలు అందించేందుకు వీలుగా ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. 30 వేల ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టీఫైబర్ సంస్థ వేణు ప్రసాద్ వెల్లడించారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లో భాగంగా తొలిదశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని మద్దూరు, సంగుపేట్, అడవి శ్రీరామ్‌పూర్ గ్రామాల్లో టీ ఫైబర్ ట్రయల్ సేవలను ఈనెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్‌వర్క్‌తో పాటు టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. పలు తెలుగు ఓటీటీలను సైతం ప్రజలు చూడటానికి వీలుపడుతుంది. తొలి దశలో నారాయణపేట, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఆ తర్వాత మిగిలిన గ్రామాల్లోనూ ఏర్పాట్లు పూర్తిచేయనున్నారు. భారత్ నెట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించగా.. ఈ పథకం కింద తెలంగాణలోని గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్‌నెట్ కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్‌ను అందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.