Telangana : తెలంగాణ ప్ర‌జ‌ల‌కి గుడ్ న్యూస్.. రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana : తెలంగాణ ప్ర‌జ‌ల‌కి గుడ్ న్యూస్.. రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 December 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Telangana : తెలంగాణ ప్ర‌జ‌ల‌కి గుడ్ న్యూస్.. రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌..!

Telangana : తెలంగాణ సర్కార్ ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన హామీల‌ని ఒక్కొక్క‌టిగా నెర‌వేరుస్తుంది. ఇకపై తెలంగాణలో అత్యంత చౌకగా ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. టి ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ప్రభుత్వం 300 రూపాయలకే ఇవ్వనుంది. ఈ కనెక్షన్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న టీవీని కంప్యూటర్ మాదిరిగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా టీవీలోనే ప్రత్యేక వెసులబాటును కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 20 ఎంబిబిఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ కనెక్షన్ అందివ్వనుంది ప్రభుత్వం. ఇందులో పలు తెలుగు ఓటీటీలు కూడా అందుబాటులో ఉంటాయి.

Telangana తెలంగాణ ప్ర‌జ‌ల‌కి గుడ్ న్యూస్ రూ300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌

Telangana : తెలంగాణ ప్ర‌జ‌ల‌కి గుడ్ న్యూస్.. రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌..!

Telangana గొప్ప కార్య‌క్ర‌మం..

ఈ ప్రాజెక్టు తొలి దశలో తెలంగాణ వ్యాప్తంగా 94 మండలాలు, 2,096 గ్రామ పంచాయతీల్లో కమర్షియల్‌ సేవలు అందించేందుకు వీలుగా ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. 30 వేల ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టీఫైబర్‌ సంస్థ వేణు ప్రసాద్ వెల్లడించారు. ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్ లో భాగంగా తొలిదశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని మద్దూరు, సంగుపేట్, అడవి శ్రీరామ్‌పూర్‌ గ్రామాల్లో టీ ఫైబర్‌ ట్రయల్‌ సేవలను ఈనెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

ఈ కనెక్షన్‌ తీసుకుంటే వర్చువల్‌ నెట్‌వర్క్‌తో పాటు టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. పలు తెలుగు ఓటీటీలను సైతం ప్రజలు చూడటానికి వీలుపడుతుంది. తొలి దశలో నారాయణపేట, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఆ తర్వాత మిగిలిన గ్రామాల్లోనూ ఏర్పాట్లు పూర్తిచేయనున్నారు. భారత్‌ నెట్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించగా.. ఈ పథకం కింద తెలంగాణలోని గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్‌నెట్‌ కల్పించేందుకు ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ను అందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది