AIYF : దేశ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్న సంపన్నుల ఆస్తులను జాతీయం చేయాలి : ఏఐవైఎఫ్
AIYF : దేశంలోని వనరులను యధేచ్చగా దోచుకుంటున్న సంపన్నులు ముకేష్ అంబానీ, ఆదానీ ఇతర బడా వ్యాపారస్తుల ఆస్తులను జాతీయం చేయాలని,యువతను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ కార్యదర్శి లెనిన్ బాబు పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వెన్షన్ హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ లో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడుతూ కార్పొరేట్ సంపన్నులు దేశాన్ని అన్ని రకాలుగా దోచుకుని తమ ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటున్నారని, కానీ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి లో మాత్రం వారి పాత్ర సూన్యమని వారు ఆరోపించారు. ఆర్ధిక స్థిరత్వం అంటే దేశ అభివృద్ధి అని, కానీ కార్పొరేట్ శక్తుల నినాదం మాత్రం తమ వ్యాపార సామ్రాజ్యాల ఎదుగుదలే ప్రధాన ధ్యేయమని వారు ఉద్ఘాటించారు. కార్పొరేట్ శక్తుల విధానాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి బహుళజాతి కంపెనీలకు రెడ్ కార్పెట్ వేసిన పాలకుల తీరు సిగ్గుచేటని, దీని మూలంగానే భారతదేశ యువతకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదని వారు వాపోయారు.దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 2023లో కార్పొరేట్ పన్ను 30 నుండి 22 శాతానికి తగ్గించారు. సంపద పన్ను తగ్గింపు వల్ల 950 కోట్ల రూపాయలు, కార్పొరేట్ పన్ను తగ్గింపుతో లక్ష కోట్ల రూపాయల రెవిన్యూ లోటు 2023లో కలిగిందన్నారు.
AIYF : దేశ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్న సంపన్నుల ఆస్తులను జాతీయం చేయాలి : ఏఐవైఎఫ్
మొదటసారిగా కార్పొరేట్ పన్ను చెల్లింపులు ఆదాయం పన్ను కంటే తగ్గిపోయాయని, దీని ఫలితంగా పారిశ్రామికవేత్తలు, అత్యంత ధనికుల లాభాలు గత మూడు సంవత్సరాల్లో 57 శాతం పెరిగినవని వారు ఉద్ఘాటించారు. దేశంలో ధనికులు రోజుకు రూ.2,200 కోట్లు వెనకేసుకుంటున్నారని వారు తెలిపారు. కానీ, సామాన్యుడి రోజూ వారి జీవన ఆర్ధికం మాత్రం పెరగడం లేదని ఆవేదన అన్నారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర లు సంయుక్తంగా మాట్లాడుతూ భారతదేశంలోనే యువత ఎక్కువ ఉందని చెప్పారు. ప్రపంచంలో 186 కోట్లమంది యువజనులు ఉంటే అందులో 28 శాతం భారతీయులేనన్నారు. నవ యువకులతో నవనవలాడుతున్న యువజన దేశం భారత్ అన్నారు. ఏ దేశానికి లేనంత యువ సంపద మనకున్నప్పటికీ ఉత్తేజం, ఉత్సాహం కరువయ్యాయన్నారు. పాలకుల వినాశకర విద్యా విధానాల కారణంగా దేశంలోని 30శాతం మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అకాశాలు లేవన్నారు. రాష్ట్ర విభజన హామీలకు దిక్కులేదని,బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే లేదన్నారు. ఖాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం,సైనిక్ స్కూల్స్ వంటి హామీలను నెరవేర్చలేదన్నారు.కనీసం వీటినైనా నిర్మించి ఉంటే వేలాది మందికి ఉపాధి లభించి ఉండేదన్నారు.
ప్రభుత్వాలు అవలంబిస్తున్న వినాశకర ఆర్థిక విధానాల ఫలితంగా చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదని విమర్శించారు. డిగ్రీలు, పీజీలు, పీహెచ్ఎలు బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, లా కోర్సులు చదివినవారు కూడా చివరకు రైల్వే గ్యాంగ్మన్ ఉద్యోగాలకు, పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు ఉద్యోగాలకు అవకాశాలు లేక వలస పోయే వారు కొందరైతే, మరికొంతమంది నిరాశ, నిస్పృహలతో కొకొయిన్, హెరాయిన్ వంటి మత్తుమందులకు బానిసలవుతున్నారన్నారు. అవినీతి, దోపిడీలకు ఆస్కారం లేని సమాజం యువత ఆకాంక్ష అని చెప్పారు. ఇది యువతతోనే సాధ్యమన్నారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వెంకటేశ్వర్లు,లింగం రవి,బిజ్జ శ్రీనివాసులు, యుగంధర్,పేరబోయిన మహేందర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆర్. బాలకృష్ణ, సల్మాన్ బేగ్,షేక్ మహమూద్,శివ కుమార్,మధు,బోనగిరి మహేందర్, మస్క సుధీర్, మోగిలి లక్ష్మణ్, మహేష్, మాజీద్ అలీ ఖాన్,కళ్యాణ్, మానస్ కుమార్,మార్కపూరి సూర్య, రాజేష్, మధు, ప్రవీణ్, అశోక్, రాజ్ కుమార్,వెంకటేష్ లతో పాటు 100మంది పాల్గొన్నారు.
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
Morning or night shower : ఇది మనలో చాలా మందికి రోజువారీ ఆచారం. ఉదయం స్నానం లేదా రాత్రి…
Tejaswi Madivada : చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. వారిలో తేజస్వి మదివాడ…
Masoor Dal : ఎర్ర పప్పు అని కూడా పిలువబడే మసూర్ పప్పు, భారతీయ వంటకాల్లో పోషక విలువలు, చికిత్సా…
Ys Jagan : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను…
Garlic : వెల్లుల్లి శతాబ్దాలుగా వంటగదిలో ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యం. ఈ మూలిక దాని యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక స్వభావం…
AP Govt Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న 175…
This website uses cookies.