the priest who killed apsara that she house owner sensational comments on saikrishna
Apsara Murder Case : హైదరాబాద్ సరూర్ నగర్ లో అప్సర అనే యువతి మర్డర్ కేస్ రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘాతుకానికి ఒక పురోహితుడు పాల్పడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. వివాహేతర సంబంధం వల్లే అప్సరా మృతి చెందిందని పోలీసులు తెలియజేశారు. అప్సర పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పురోహితుడు సాయికృష్ణ ఆమెను చంపినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా ఈ కేసులో అప్సర ఉంటున్న ఇంటి యజమాని కీలక విషయాలు వెల్లడించారు. కొన్ని తమిళ సినిమాల్లో నటించిన అప్సర ఆ తరువాత హైదరాబాద్ లో వచ్చి సీరియల్స్ లో నటించేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో తాము ఉంటున్న ప్రాంతంలో బంగారు మైసమ్మ గుడికి తరచూ వెళ్లేదని తెలిపారు. అయితే ఆ ఆలయంలో పూజారిగా ఉన్న సాయి కృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆ పరిచయాన్ని ఆమె కుటుంబంతోను సాయి కృష్ణ కొనసాగించాడని ఇంటి ఓనర్స్ స్పష్టం చేశారు. ఇద్దరిది ఒకే కమ్యూనిటీ కావడంతో త్వరగా కలిసిపోయారని అక్కయ్య గారు అంటూ అప్సరతో సాయి కృష్ణ వరసలు కలిపేవాడు.
the priest who killed apsara that she house owner sensational comments on saikrishna
ఆ రకంగా ఆమెకు దగ్గరయ్యాడు. అర్ధరాత్రి 11 గంటల వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. కొన్ని రోజులు అర్ధరాత్రులు కూడా అక్కడే ఉండేవాడు. మిడ్ నైట్ వాళ్ళిద్దరూ బైక్ మీద బయటకు వెళ్లేవారు. అయితే ఈ క్రమంలో తమ కొడుకుకి అనుమానం వస్తే వాళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెల బంధం ఉందని నచ్చజెప్పి… సముదాయించే వాళ్ళం. అప్పుడే అనుమానం వస్తే ఇల్లు ఖాళీ చేయించే వాళ్ళమని అప్సర ఇంటి ఓనర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.