Adipurush Movie : త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బిజినెస్ పరంగా ఈ సినిమా 550 కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే బిజినెస్ జరిగిన మొత్తం బ్రేక్ ఈవెన్ గా అందుకొని అదనంగా ఒక 50 కోట్లు వచ్చిన పఠాన్ షేర్ కలెక్షన్స్ రికార్డ్ ని ఆదిపురుష్ ఈజీగా అందుకుంటుంది. ఈ సంవత్సరం వచ్చిన సినిమాలలో షారుక్ ఖాన్ పఠాన్ సినిమా 1050 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సంవత్సరంలో ఇదే హైయెస్ట్ రికార్డ్.
దీని తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన పోనియన్ సెల్వన్ సినిమా 330 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. అయితే బడ్జెట్ పరంగా ఎక్కువ కావడంతో ఈ సినిమా ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది. ఇక తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన వారీసు సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా కొంత లాభం మాత్రమే దిల్ రాజ్ కి అందించింది. ఇక తర్వాత ది కేరళ స్టోరీ సినిమా 290 కోట్ల వరకు సాధించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం 15 కోట్లతో ఈ సినిమా తీయగా వివాదం కావడం హిందుత్వ భావజాలం ఉన్న అందరికి విపరీతంగా కనెక్ట్ కావడంతో ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. తరువాత మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య మూవీ 235 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
వీటన్నింటిలో ఆదిపురుష్ మెయిన్ టార్గెట్ మాత్రం పఠాన్ సినిమా అని చెప్పాలి. పఠాన్ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ప్రస్తుతం ఆదిపురుష్ కి ఉంది. ఆది పురుష్ సినిమా మొదటిరోజు కచ్చితంగా 100 కోట్ల వరకు కలెక్షన్స్ సాధిస్తుంది. తర్వాతి రోజు ఈ స్టోరీ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే 1000 కోట్ల వరకు కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రామాయణ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్ నటించింది. ఇక రావణుడి పాత్రలో రన్వీర్ సింగ్ నటించాడు. ఇక రాముడిగా ప్రభాస్ చేసే యుద్ధ విన్యాసాలు అభిమానులను బాగా ఆకట్టుకుంటాయని ఇండస్ట్రీ వర్గాల టాక్.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.