AISF : పహల్గాంలోని పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి
AISF : గురువారం నాడు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పహాల్గమ్ ఘటనలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ, వారి మరణానికి కారణమయిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, ఉగ్రవాదుల దిష్టిబొమ్మని హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ…
AISF : పహల్గాంలోని పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో Kashmir Pahalgam ఉగ్రదాడిని ఖండించారు. ఈ ఈ ఘటన అత్యంత విషాదకరమనీ,ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే, ఉగ్ర మూకలను కఠినంగా శిక్షించాలన్నారు. దేశ సమగ్రతను సమైక్యతను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మరియు కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ఉగ్ర మూకాలు కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కడ దాగి ఉన్న వెంటాడి శిక్షించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉగ్రవాదులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సమన్వయంతో ఉగ్రవాదులను ఏరివేత చేపట్టాలని, భవిష్యత్తులో దేశంలో ఎక్కడ ఉగ్ర దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు దేశ యువత నడుము బిగించాలన్నారు. మరణించిన కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సామిడి వంశీవర్ధన్ రెడ్డి, ఎండి అన్వర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చైతన్య యాదవ్, రాష్ట్ర నాయకులు అరుణ్, హరీష్, జ్ఞానేశ్వర్, అశ్విన్, వెంకటేష్, ఉదయ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
This website uses cookies.