BRS MLAs’ Disqualification : ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారా..?
BRS MLAs’ Disqualification : తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అనర్హత వేటుకు భయపడి నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో అనర్హత వేటు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నలుగురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో ఈ అంశంపై చర్చలు జరుపుతున్నారు.

those four MLAs ready to resign
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత ఒకేసారి రాజీనామా చేయాలని వారు యోచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల ఒకే సమయంలో అన్ని చోట్లా ఉప ఎన్నికలు వస్తాయని, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గుతుందని వారు భావిస్తున్నారు.
ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కీలకమైనదిగా మారింది. బీఆర్ఎస్ పార్టీ గతంలోనే ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు ఎమ్మెల్యేలే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం రాజకీయ వ్యూహాత్మక చర్యగా భావించాలి. అయితే, ఈ రాజీనామాలు వాస్తవంగా జరుగుతాయా లేదా అనేది చూడాలి. ఒకవేళ రాజీనామాలు చేస్తే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.