
Tanu Nayak : ఠాను నాయక్ కు ఘనంగా నివాళులు
Tanu Nayak : ఈరోజు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం bhadradri kothagudem జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో జాటోత్ ఠాను వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు వారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడుతూ జటోత్ ఠాను నాయక్ 75వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు లంబాడ మహా పోరాట యోధుడు జాటోత్ ఠాను నాయక్ 1950 మార్చి 20 న ముండ్రాయి దొర గుండాలతో పోరాడుతూ వీరమరణం చెందాడని అన్నారు నిజాం ప్రభుత్వం హో0 డిపార్ట్మెంట్ నివేదికలు పరిశీలిస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఆనాడు తెలిశాయని అన్నారు.
Tanu Nayak : ఠాను నాయక్ కు ఘనంగా నివాళులు
కమ్యూనిస్టు పార్టీ తెలంగాణకు Telangana రాకముందే ఠాను నాయక్ కుటుంబం దొరలను ఎదిరించి భూములపై తమ హక్కులను సాధించుకున్నారని అన్నారు తెలంగాణ సాయుధ పోరాటానికి బీజం వేసింది ఠాను నాయక్ కుటుంబమేనని అన్నారు భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం విసునూరు దేశ్ముఖ్ గుండాలను నిజాం రజాకారులను ఎదిరించిన ధైర్యశాలి ఠాను నాయక అని అన్నారు ఇలా అనేక పోరాటాలు చేస్తూ ఉంటే ఆయన ఆచూకీ కోసం అనేకమంది ద్రోహులను రజాకారులు నియమించుకున్నారు చివరకు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో మొండ్రాయికి సమీపంలో నున్న నీలి బండ తండాలో ఠాను నాయక్ అతని ఉద్యమ సహచరుడుని పోలీసులు పట్టుకొని మొండ్రాయి భూస్వాముల గడిలో ఒక బండి చక్రానికి కట్టేసి అతి కిరాతకంగా హింసించి చంపుతుంటే ప్రజలు కన్నీరు మున్నీరయ్య అన్నారు .
ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ జిల్లా అధికార ప్రతినిధి బానోత్ నాగరాజు నాయక్ జిల్లా కార్యదర్శి బాదావత్ సురేష్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు బట్టు హుస్సేన్ నాయక్ సంపత్ నాయక్ సీతారాం నాయక్ హుస్సేన్ నాయక్ కిషన్ నాయక్ రవి నాయక్ హర్సింగ్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.