Tanu Nayak : ఠాను నాయక్ కు ఘనంగా నివాళులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tanu Nayak : ఠాను నాయక్ కు ఘనంగా నివాళులు

 Authored By ramu | The Telugu News | Updated on :20 March 2025,10:10 pm

Tanu Nayak  : ఈరోజు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం bhadradri kothagudem జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో జాటోత్ ఠాను వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు వారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడుతూ జటోత్ ఠాను నాయక్ 75వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు లంబాడ మహా పోరాట యోధుడు జాటోత్ ఠాను నాయక్ 1950 మార్చి 20 న ముండ్రాయి దొర గుండాలతో పోరాడుతూ వీరమరణం చెందాడని అన్నారు నిజాం ప్రభుత్వం హో0 డిపార్ట్మెంట్ నివేదికలు పరిశీలిస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఆనాడు తెలిశాయని అన్నారు.

Tanu Nayak ఠాను నాయక్ కు ఘనంగా నివాళులు

Tanu Nayak : ఠాను నాయక్ కు ఘనంగా నివాళులు

కమ్యూనిస్టు పార్టీ తెలంగాణకు Telangana రాకముందే ఠాను నాయక్ కుటుంబం దొరలను ఎదిరించి భూములపై తమ హక్కులను సాధించుకున్నారని అన్నారు తెలంగాణ సాయుధ పోరాటానికి బీజం వేసింది ఠాను నాయక్ కుటుంబమేనని అన్నారు భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం విసునూరు దేశ్ముఖ్ గుండాలను నిజాం రజాకారులను ఎదిరించిన ధైర్యశాలి ఠాను నాయక అని అన్నారు ఇలా అనేక పోరాటాలు చేస్తూ ఉంటే ఆయన ఆచూకీ కోసం అనేకమంది ద్రోహులను రజాకారులు నియమించుకున్నారు చివరకు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో మొండ్రాయికి సమీపంలో నున్న నీలి బండ తండాలో ఠాను నాయక్ అతని ఉద్యమ సహచరుడుని పోలీసులు పట్టుకొని మొండ్రాయి భూస్వాముల గడిలో ఒక బండి చక్రానికి కట్టేసి అతి కిరాతకంగా హింసించి చంపుతుంటే ప్రజలు కన్నీరు మున్నీరయ్య అన్నారు .

ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ జిల్లా అధికార ప్రతినిధి బానోత్ నాగరాజు నాయక్ జిల్లా కార్యదర్శి బాదావత్ సురేష్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు బట్టు హుస్సేన్ నాయక్ సంపత్ నాయక్ సీతారాం నాయక్ హుస్సేన్ నాయక్ కిషన్ నాయక్ రవి నాయక్ హర్సింగ్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Advertisement
WhatsApp Group Join Now

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది