షాకింగ్ న్యూస్‌.. 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అల‌క‌… ఆ ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

షాకింగ్ న్యూస్‌.. 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అల‌క‌… ఆ ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు..?

 Authored By himanshi | The Telugu News | Updated on :12 March 2021,6:50 pm

12 TRS MLAs : టీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా గెలవాలనే పట్టుదలతో కేసీఆర్ మరియు కేటీఆర్ ప్రత్యేకంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు జీడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇలా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పని చేసే విధంగా ఒక పైప్ లైన్ ను ఏర్పాటు చేశారు. దాని ప్రకారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తమ నియోజక వర్గాల్లో ప్రతి రోజు పర్యటనలు చేస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సి ఉంది. కాని కొందరు ఎమ్మెల్యేలు మరియు మంత్రులు మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు.

KTR : వారిపై కేటీఆర్ సీరియస్‌…

కింది స్థాయి కార్యకర్తలు మరియు నాయకులు మినహా ఎమ్మెల్సీలు చాలా మంది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంకు డుమ్మా కొడుతున్నట్లుగా టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ దృష్టికి వచ్చిందట. దాంతో ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు మరియు కార్యకర్తలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తేనే గెలుపుపై అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రచారంకు దూరంగా ఉంటే పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ క్లాస్ పీకాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

TRS Party

TRS Party

TRS MLAs :  ఆ 12 మందిని ఏం చేయబోతున్నారు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కనీసం ఒక్క సారి కూడా నియోజక వర్గంలో పర్యటించకుండా హైదరాబాద్‌ లో ఉండి తమ పనులను చక్కబెట్టుకుంటూ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం 12 మంది ఉన్నారు. వారిలో కొందరు అనారోగ్య సమస్యలు చెప్పి ఎండకు వెళ్లడం కష్టంగా ఉందని చెప్తే మరి కొందరు ఇతర కారణాలు చెబుతున్నారు. ఒక వేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థి ఓడిపోయినా కూడా ఆ ఓడిపోయిన అభ్యర్థికి నియోజక వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు మార్చేందుకు నియోజక వర్గ ఇన్‌ చార్జ్‌ లను ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అంటే వారికి తదుపరి ఎన్నికల్లో సీటు రావడం కష్టం. అందుకే ఈ చివరి రోజుల్లో అయినా ఆ ఎమ్మెల్యేలు ప్రచారం చేసేందుకు ముందుకు వస్తారా అనేది చూడాలి.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది