Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే తల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!
ప్రధానాంశాలు:
Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే తల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా కానిస్టేబుల్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. డ్యూటీలో లేకపోయినా, చంటి బిడ్డను చంకలో పెట్టుకుని ఉన్న సమయంలోనూ, ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు స్వయంగా దారి క్లియర్ చేసి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు రంగంపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతి.కాకినాడ–సామర్లకోట ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదే సమయంలో అత్యవసర పరిస్థితిలో ఉన్న ఓ అంబులెన్స్ ఆ ట్రాఫిక్‌లో చిక్కుకుంది.
Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే తల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!
Viral Video ఆదర్శంగా నిలిచిన జయశాంతి
చుట్టూ ఉన్నవారు చూస్తూ ఉండిపోయినా, డ్యూటీలో లేని మహిళా కానిస్టేబుల్ జయశాంతి మాత్రం స్పందించారు. చేతిలో తన చిన్నారి ఉన్నప్పటికీ, ఏ మాత్రం వెనకడుగు వేయకుండా రోడ్డుపైకి వచ్చి వాహనాలను క్రమబద్ధీకరించారు.తన పోలీస్ అనుభవం, సమయస్ఫూర్తితో ట్రాఫిక్‌ను నియంత్రించి అంబులెన్స్‌కు దారి చూపించారు. ఆమె చేసిన ఈ ప్రయత్నం వల్ల అంబులెన్స్ సకాలంలో గమ్యస్థానానికి చేరింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు, ప్రజలు జయశాంతి చూపిన మానవత్వం, కర్తవ్యనిష్ఠను కొనియాడుతున్నారు.
“ఒక చేతిలో బిడ్డ, మరో చేతిలో బాధ్యత” అంటూ ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. పోలీస్ శాఖలో మహిళల పాత్ర ఎంత గొప్పదో ఆమె మరోసారి చాటిచెప్పారని ప్రశంసిస్తున్నారు. డ్యూటీ టైమ్ కాదనే ఆలోచన లేకుండా, తన వ్యక్తిగత బాధ్యతలను పక్కన పెట్టి సమాజానికి మేలు చేసేలా వ్యవహరించిన జయశాంతి నిజంగా అభినందనీయురాలు. మాతృత్వం, విధి నిర్వహణ రెండింటినీ సమతూకంగా నిలబెట్టిన ఆమె చర్య ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సంఘటనతో “పోలీస్ అంటే కేవలం యూనిఫాం మాత్రమే కాదు.. అది బాధ్యత, మానవత్వం” అనే సందేశాన్ని జయశాంతి మరోసారి నిరూపించారు.
ఒక చేతిలో పేగు బంధం.. మరో చేతిలో సమాజ బాధ్యత! 🫡
డ్యూటీలో లేకపోయినా, చంటి బిడ్డ చంకలో ఉన్నా.. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అంబులెన్స్ కోసం స్వయంగా దారి క్లియర్ చేసిన ఏపీలోని రంగంపేట మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతి గారికి హ్యాట్సాఫ్.
కాకినాడ – సామర్లకోట రోడ్డులో ఆమె చూపిన… pic.twitter.com/fzI5qV2PN8
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 18, 2026