Ponguleti Srinivasa Reddy : ఇందిరమ్మ ఇళ్ల పై పొంగులేటి కీలక అప్‌డేట్..!
ప్రధానాంశాలు:
Ponguleti Srinivasa Reddy : ఇందిరమ్మ ఇళ్ల పై పొంగులేటి కీలక అప్‌డేట్..!
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా వెంకటాపురం (ఎం) మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో కలిసి పాల్గొన్న ఆయన, పలువురు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ధరణి చట్టం వల్ల పలు సమస్యలు ఎదురయ్యాయని, వాటికి పరిష్కారంగా కొత్త భూభారతి–2025 చట్టం తీసుకొచ్చామని తెలిపారు. గ్రామాల్లో ఇళ్లకు సంబంధించి ఆబాదీ భూములకు డాక్యుమెంట్లు ఇవ్వనున్నామని హామీ ఇచ్చారు.

Ponguleti Srinivasa Reddy : ఇందిరమ్మ ఇళ్ల పై పొంగులేటి కీలక అప్‌డేట్..!
Ponguleti Srinivasa Reddy : రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి వద్ద ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు
రాష్ట్రవ్యాప్తంగా భూభారతి చట్టంపై అవగాహన పెంచేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇదే సందర్భంగా రైతుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు పేర్కొన్నారు. వెంకటాపురం సదస్సులో 746 దరఖాస్తులు స్వీకరించామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ధరణి చట్టంతో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. తమ భూములు రికార్డుల్లో ఉండి కూడా తొలగించారని వాపోయారు. ధరణిలో ఎక్కించేందుకు ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరిగామని, కానీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టా లేకపోవడంతో ఎన్నో ప్రభుత్వ పథకాలు అందకుండా పోయాయని కొందరు మహిళా రైతులు పేర్కొన్నారు. భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలతో జీవిస్తున్న తాను ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయం తిరిగినా పట్టా రాలేదని ఓ మహిళ పేద్దగా కన్నీరు పెట్టుకుంది. భూభారతి చట్టంతోనైనా తమకు న్యాయం జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తాజా ప్రకటనలతో పేదలకి భరోసా కలుగుతుందని, భూ సమస్యలు లేకుండా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని అధికారులు తెలిపారు.