Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల పది రోజుల సమయం మాత్రమే ఉంది. అంటే ఇంకో నెల పది రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుందో తేలిపోనుంది. మూడోసారి బీఆర్ఎస్ కు అధికారం ఇస్తారా? బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా? లేక ఒక్కసారి అటు కాంగ్రెస్ లేదా ఇటు బీజేపీకి చాన్స్ ఇస్తారా? అనేది తెలియదు. కానీ.. ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ తెగ వ్యూహాలు రచిస్తున్నాయి. మామూలుగా కాదు.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈనేపథ్యంలో అసలు తెలంగాణలో ఏ పార్టీ గెలువబోతోంది అనేది సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే లోకల్, నేషనల్ సర్వేలు తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందో సర్వేలు చెప్పకనే చెబుతున్నాయి. ఒక్కో సర్వే ఒక్కో విధంగా చెబుతోంది.
ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని నాశనం చేశారని.. మూడోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని గెలవనీయకూడదని కాంగ్రెస్ తెగ వ్యూహాలు రచిస్తోంది. కానీ.. జాతీయ సర్వే సంస్థలు విడుదల చేసే సర్వేలు చూసి మాత్రం ప్రతి పార్టీకి ఏదో ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అవుతోంది. అయితే.. ఇప్పటి వరకు విడుదలైన చాలా సర్వేలు తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదే అని చెప్పుకొచ్చాయి. వాటికి తగ్గట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో అధికార పార్టీకి లేని పోని టెన్షన్ స్టార్ట్ అయింది. తాజాగా మరో ప్రముఖ సంస్థ ఇండియా టుడే తమ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వేలో కూడా కాంగ్రెస్ హవా ఉంటుందని తేలిపోయింది.
ఒకవేళ బీజేపీ పుంజుకుంటే తెలంగాణలో ఫలితాలు మారబోతున్నాయి. ఏది ఏమైనా ఇండియా టుడే సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 54 సీట్లు, బీఆర్ఎస్ కు 49 సీట్లు, బీజేపీకి 8 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఓట్ల శాతం చూస్తే బీఆర్ఎస్ కు 39 శాతం సీట్లు, కాంగ్రెస్ కు 38 శాతం సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేను చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో గులాబీ పార్టీ పెద్దలో గుబులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.