Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అధికారం ఎవరిదో తేలిపోయింది.. గెలిచేది ఆ పార్టీనే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అధికారం ఎవరిదో తేలిపోయింది.. గెలిచేది ఆ పార్టీనే?

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల పది రోజుల సమయం మాత్రమే ఉంది. అంటే ఇంకో నెల పది రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుందో తేలిపోనుంది. మూడోసారి బీఆర్ఎస్ కు అధికారం ఇస్తారా? బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా? లేక ఒక్కసారి అటు కాంగ్రెస్ లేదా ఇటు బీజేపీకి చాన్స్ ఇస్తారా? అనేది తెలియదు. కానీ.. ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ తెగ వ్యూహాలు రచిస్తున్నాయి. మామూలుగా కాదు.. ఎన్నికల ప్రచారాన్ని […]

 Authored By kranthi | The Telugu News | Updated on :22 October 2023,8:00 pm

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల పది రోజుల సమయం మాత్రమే ఉంది. అంటే ఇంకో నెల పది రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుందో తేలిపోనుంది. మూడోసారి బీఆర్ఎస్ కు అధికారం ఇస్తారా? బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా? లేక ఒక్కసారి అటు కాంగ్రెస్ లేదా ఇటు బీజేపీకి చాన్స్ ఇస్తారా? అనేది తెలియదు. కానీ.. ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ తెగ వ్యూహాలు రచిస్తున్నాయి. మామూలుగా కాదు.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈనేపథ్యంలో అసలు తెలంగాణలో ఏ పార్టీ గెలువబోతోంది అనేది సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే లోకల్, నేషనల్ సర్వేలు తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందో సర్వేలు చెప్పకనే చెబుతున్నాయి. ఒక్కో సర్వే ఒక్కో విధంగా చెబుతోంది.

ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని నాశనం చేశారని.. మూడోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని గెలవనీయకూడదని కాంగ్రెస్ తెగ వ్యూహాలు రచిస్తోంది. కానీ.. జాతీయ సర్వే సంస్థలు విడుదల చేసే సర్వేలు చూసి మాత్రం ప్రతి పార్టీకి ఏదో ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అవుతోంది. అయితే.. ఇప్పటి వరకు విడుదలైన చాలా సర్వేలు తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదే అని చెప్పుకొచ్చాయి. వాటికి తగ్గట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో అధికార పార్టీకి లేని పోని టెన్షన్ స్టార్ట్ అయింది. తాజాగా మరో ప్రముఖ సంస్థ ఇండియా టుడే తమ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వేలో కూడా కాంగ్రెస్ హవా ఉంటుందని తేలిపోయింది.

who will get power in telangana

#image_title

Telangana Assembly Elections 2023 : బీజేపీ పుంజుకుంటే మారనున్న ఫలితాలు

ఒకవేళ బీజేపీ పుంజుకుంటే తెలంగాణలో ఫలితాలు మారబోతున్నాయి. ఏది ఏమైనా ఇండియా టుడే సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 54 సీట్లు, బీఆర్ఎస్ కు 49 సీట్లు, బీజేపీకి 8 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఓట్ల శాతం చూస్తే బీఆర్ఎస్ కు 39 శాతం సీట్లు, కాంగ్రెస్ కు 38 శాతం సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేను చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో గులాబీ పార్టీ పెద్దలో గుబులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది