మరణం కూడా వేరు చేయలేని పవిత్ర బంధం.. భర్త మ‌ర‌ణించిన కొన్ని గంట‌ల్లోనే భార్య మృతి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

మరణం కూడా వేరు చేయలేని పవిత్ర బంధం.. భర్త మ‌ర‌ణించిన కొన్ని గంట‌ల్లోనే భార్య మృతి..!

ఈ ప్రపంచంలో భార్యాభర్తలకు మించిన బంధం మరొకటి ఉండదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అన్ని బంధాల కంటే కూడా భార్య భర్తల బంధం చాలా బలంగా శాశ్వతంగా ఉంటుంది. ఇక ఈ భార్యాభర్తల బంధంలో ఒకరికోసం ఒకరు బతకడం జీవితం. ఇక అందుకు సజీవ సాక్ష్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన వృద్ధ దంపతులు అని చెప్పాలి. ఎందుకంటే ఈ భార్యాభర్తల బంధాన్ని చివరకు చావు కూడా వేరు చేయలేకపోయింది.అందుకే ఆత్మీయ దంపతులకు […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 February 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  మరణం కూడా వేరు చేయలేని పవిత్ర బంధం.. భర్త మ‌ర‌ణించిన కొన్ని గంట‌ల్లోనే భార్య మృతి..!

ఈ ప్రపంచంలో భార్యాభర్తలకు మించిన బంధం మరొకటి ఉండదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అన్ని బంధాల కంటే కూడా భార్య భర్తల బంధం చాలా బలంగా శాశ్వతంగా ఉంటుంది. ఇక ఈ భార్యాభర్తల బంధంలో ఒకరికోసం ఒకరు బతకడం జీవితం. ఇక అందుకు సజీవ సాక్ష్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన వృద్ధ దంపతులు అని చెప్పాలి. ఎందుకంటే ఈ భార్యాభర్తల బంధాన్ని చివరకు చావు కూడా వేరు చేయలేకపోయింది.అందుకే ఆత్మీయ దంపతులకు ఆ జంట నిదర్శనం అని చెప్పాలి. వృద్ధాప్యంలో కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవనం సాగించారు. ఇక ఈ క్రమంలోనే మరణంలో కూడా వారి బంధం వేరుపడలేదు.ఎందుకంటే తన భర్త అనారోగ్యంతో చనిపోతే అదే రోజు భార్య బెంగతో ప్రాణాలు విడిచింది… పూర్తి వివరాల్లోకెళ్తే…

భార్యాభర్తల బంధం అంటే పాలు నీళ్లలా కలిసిపోవాలని మన పెద్దలు అంటూ ఉంటారు.ఎందుకంటే వేర్వేరుగా ఉన్నంతవరకే వాటిని పాలు, నీళ్లు అని చెప్పగలుగుతాం కానీ ఒక్కసారి ఆ రెండు కలిస్తే మాత్రం పాల ను నీళ్ల ను వేరు చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలతో కూడిన ప్రేమ మొదలై భార్య భర్తల బంధం ఏర్పడిన తర్వాత ఆ దంపతులను వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పాలి. ఇక అలాంటిదే భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన ఈ వృద్ధ భార్యాభర్తల జీవనం అని చెప్పాలి.ఎందుకంటే మరణం లో కూడా వారి బంధం వేరుకాలేదు. అయితే భర్త అనారోగ్యంతో చనిపోవడంతో అదే రోజు భార్య తన భర్తపై బెంగ పెట్టుకొని ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన పినపాక మండలంలో చోటుచేసుకుంది. దీంతో ఆదర్శ దంపతులు హఠాన్మరణం అందర్నీ కంటతడి పెట్టించింది అని చెప్పాలి.

అయితే పినపాక మాజీ సర్పంచ్ సుంకరి రాములు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారట.ఈ నేపథ్యంలోనే సోమవారం ఆరోగ్యం క్షీణించి సుంకరి రాములు మృతి చెందడం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె భార్య నర్సమ్మ భర్త లేకుండా ఎలా బతకగలను అనుకుందో ఏమో కానీ అదే రోజు సాయంత్రం తనువు చాలించింది. అయితే తల్లిదండ్రులు ఇద్దరు ఒకేరోజు మరణించడంతో వారి పిల్లలు విలపించిన తీరు గ్రామస్తులను తీవ్ర కంటతడి పెట్టించింది.దీంతో రాములు నరసమ్మ దంపతులకు కలిపి అంతక్రియ కార్యక్రమాలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఇక ఈ ఆదర్శ దంపతుల ఆంతిమ యాత్రలో గ్రామస్తులంతా పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు.అయితే 80 ఏళ్ల వయసులో కూడా ఒకరిపై ఒకరు పెట్టుకున్న ప్రేమతో చివరికి ఒకేసారి మరణించి ఒకటయ్యారు. తనువు వేరైనా తాము ఒకటే అన్నట్లుగా ప్రపంచానికి ఈ ఆదర్శ దంపతులు చూపించారు అని చెప్పాలి.మరి వీరి పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది