మందు బాబులకు బ్యాడ్ న్యూస్… నేటి నుంచి వైన్స్‌లు బంద్..!
Wine Shops : హోలీ అంటే సరదాగా రంగులు పూసుకుని ఆ తర్వాత ఫుల్ గా తాగి ఊగి మరింత రచ్చ చేసి రంగులు పూసుకుని ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాని హోలీ అనగానే ప్రభుత్వాలు వైన్స్ అని మూసి వేస్తున్నాయి. ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ ను ఏకంగా మూడు రోజుల పాటు మూసి వేయాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మందు బాబులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగే ఈ మూడు రోజులు ఎందుకు మూసి వేస్తున్నారు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
Wine Shops : కరోనా కారణంగానే..
కరోనా మళ్లీ విజృంభిస్తూ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే హోలీ పండుగ పై నిషేద ఆజ్ఞలను రాష్ట్ర ప్రభుత్వం విధించింది. ఇదే సమయంలో వైన్స్ ను కూడా మూసి వేయడం ద్వారా హోలీ వేడుకలను కాస్త అయినా తగ్గించ వచ్చు అని అధికారులు భావించారు. అందుకే కరోనా వంగ చూపించి మందు బాబుల పొట్ట కొడుతున్నారు అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. కొందరు మాత్రం ఈ నిర్ణయం పట్ల అభినందనలు తెలియజేస్తున్నారు.
మూడు రోజులు బంద్ ఎందుకు…
28వ తారీకు సాయంత్రం నుండి మొదలుకుని 29 మరియు 30వ తారీకు వరకు కూడా మద్యం అమ్మకాలు పూర్తిగా బంద్ చేయాల్సిందే అంటూ ప్రభుత్వం ప్రకటన చేసింది. పండుగ ఒక్క రోజే కదా ఎందుకు మూడు రోజులు మద్యం షాప్ లను క్లోజ్ చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విద్యాసంస్థలను మాత్రమే మూసి వేయడం వల్ల విమర్శలు వస్తున్నాయి. అందుకే మద్యం షాప్ లను మూసి వేసి కాస్త ఆ విమర్శలను తగ్గించుకోవాలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.