Crime News : ఈ యువతి స్టోరీ తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. చివరకు తనువు చాలించేసుకుంది.. ఎందుకో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Crime News : ఈ యువతి స్టోరీ తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. చివరకు తనువు చాలించేసుకుంది.. ఎందుకో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :6 January 2023,8:30 am

Crime News : మనిషి జీవితం ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నిజానికి మనకు ఉండేది ఒకటే జీవితం. కానీ.. ఈ జీవితానికి ఎన్నో సమస్యలు. సుఖం కంటే సంతోషం కంటే ఎక్కువగా కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. దీంతో ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు. జీవితం అనగానే సంతోషాలు మాత్రమే కాదు.. బాధలను కూడా అనుభవించాలి. ఆ బాధలను మేము పడలేం అని చెప్పి చివరకు జీవితాన్ని ముగించేసుకోకూడదు.

young girl commits suicide after struggling with disease in telangana

young girl commits suicide after struggling with disease in telangana

కానీ.. చాలామంది జీవితాన్ని ఈదలేక తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నారు. అలా తెలంగాణకు చెందిన హారిక అనే 19 ఏళ్ల యువతి కూడా తన జీవితాన్ని ముగించేసుకుంది. తనది మంచిర్యాల జిల్లా దొనబండ అనే గ్రామం. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే గత మూడేళ్ల నుంచి హారికకు అంతుచిక్కని వ్యాధి సోకింది. దాని వల్ల తను చాలా బాధపడింది. దీంతో తన తల్లిదండ్రులు తనను పలు ఆసుపత్రులకు తిప్పారు. లక్షలు ఖర్చు పెట్టారు. దీంతో కాస్త నయం అయింది. కానీ.. కొన్ని రోజులకే ఆ రోగం మళ్లీ తిరగబడింది. దీంతో హారికకు ఏం చేయాలో అర్థం కాలేదు.

Crime News : ఆ రోగాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న హారిక

ఆ రోగంతో మళ్లీ నరకం చూసింది హారిక. తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది హారిక. తనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ.. తన ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. తమ కూతురు బతకాలని లక్షలు ఖర్చు పెట్టారు. అయినా కూడా ఫలితం దక్కలేదు. చివరకు కూతురే తనువును చాలించేసుకుందని ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది