EPFO : పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త అందించనుందా.. అంటే అవుననే తెలుస్తోంది. ఈపీఎఫ్ వో పెన్షన్ డబ్బులను రెట్టింపు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పీఎఫ్ చందాదారులకు ఊరట కలుగనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం సబ్‌స్క్రైర్లకు నెలకు రూ.1000 పెన్షన్ మాత్రమే లభిస్తోంది. ఇది చాలా అంటే చాలా టా తక్కువ అనే చెప్పుకోవాలి. అందుకే కార్మిక మంత్రిత్వ శాఖ ఈ పెన్షన్ డబ్బులను పెంచాల్సిన అసవరం ఉందని పార్లమెంట్ కమిటీ సూచించింది. అంతేగాక పార్లమెంట్ స్టండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ 2022-23ని పార్లమెంటుకు సమర్పించింది.
ఇందులో పీఎఫ్ పెన్షన్ పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి తెలిపిందిదీని వల్ల 7 కోట్ల మంది ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ నివేదికలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. 8 సంవత్సరాల క్రింత నిర్ణయించిన రూ.1000 ఇప్పుడు చాలా తక్కువని పేర్కొంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 సమీక్ష కోసం కార్మిక మంత్రిత్వ శాఖ 2018లో అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా పెన్షన్ డబ్బులు పెంచాలని సూచించింది.
పీఎఫ్ చందాదారులకు రూ.2 వేల డబ్బులు పెన్షన్ కింద అందించాలని సిఫార్సు చేసింది. దీని కోసం వార్షిక బడ్జెట్‌ను కేటాయించుకోవాలని తెలిపింది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. కనీస పెన్షన్‌ను రూ.1000గానే కొనసాగించింది.అంతేకాకుండా తాజా నివేదికలో పలు సమస్యల గురించి కూడా ప్రస్థావించారు. పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు మరీ ముఖ్యంగా 2015 కన్నా ముందు పదవీ విరమణ చేసిన వారు ఇనామినేషన్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని నివేదిక పేర్కొంది. అలాగే ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ పోర్ట్ ఫంక్షనింగ్‌లో కూడా సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు నివేదికలో తెలిపారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.