EPFO : పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్..? ఆ మ‌నీ డ‌బుల్ అయ్యే చాన్స్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

EPFO : పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్..? ఆ మ‌నీ డ‌బుల్ అయ్యే చాన్స్..!!

 Authored By mallesh | The Telugu News | Updated on :18 March 2022,8:30 pm

EPFO : పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభ‌వార్త అందించ‌నుందా.. అంటే అవున‌నే తెలుస్తోంది. ఈపీఎఫ్ వో పెన్షన్ డబ్బులను రెట్టింపు చేసే అవకాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పీఎఫ్ చందాదారులకు ఊరట కలుగనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం సబ్‌స్క్రైర్లకు నెలకు రూ.1000 పెన్షన్ మాత్రమే లభిస్తోంది. ఇది చాలా అంటే చాలా టా తక్కువ అనే చెప్పుకోవాలి. అందుకే కార్మిక మంత్రిత్వ శాఖ ఈ పెన్షన్ డబ్బులను పెంచాల్సిన అసవరం ఉందని పార్లమెంట్ కమిటీ సూచించింది. అంతేగాక పార్లమెంట్ స్టండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ 2022-23ని పార్లమెంటుకు సమర్పించింది.

ఇందులో పీఎఫ్ పెన్షన్ పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి తెలిపిందిదీని వ‌ల్ల 7 కోట్ల మంది ఖాతాదారుల‌కు ల‌బ్ది చేకూర‌నుంది. డిమాండ్స్ ఫ‌ర్ గ్రాంట్స్ నివేదికలో పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ.. 8 సంవ‌త్స‌రాల క్రింత నిర్ణ‌యించిన రూ.1000 ఇప్పుడు చాలా త‌క్కువ‌ని పేర్కొంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విష‌యంలో మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించింది.ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 సమీక్ష కోసం కార్మిక మంత్రిత్వ శాఖ 2018లో అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా పెన్షన్ డబ్బులు పెంచాలని సూచించింది.

center good news for EPFo doubles Wo pension money

center good news for EPFo doubles Wo pension money

EPFO : అమ‌లైతే 7 కోట్ల మంది ఖాతాదారుల‌కు ల‌బ్ది

పీఎఫ్ చందాదారులకు రూ.2 వేల డబ్బులు పెన్షన్ కింద అందించాలని సిఫార్సు చేసింది. దీని కోసం వార్షిక బడ్జెట్‌ను కేటాయించుకోవాలని తెలిపింది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. కనీస పెన్షన్‌ను రూ.1000గానే కొనసాగించింది.అంతేకాకుండా తాజా నివేదికలో పలు సమస్యల గురించి కూడా ప్రస్థావించారు. పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు మరీ ముఖ్యంగా 2015 కన్నా ముందు పదవీ విరమణ చేసిన వారు ఇనామినేషన్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని నివేదిక పేర్కొంది. అలాగే ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ పోర్ట్ ఫంక్షనింగ్‌లో కూడా సమస్యలు ఉత్పన్నం అవుతున్న‌ట్లు నివేదికలో తెలిపారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది