Chanakya Neeti : భార్యాభర్తలు రాత్రి పూట సిగ్గు వదిలేసి ఈ పని చేయడానికి అస్సలు సిగ్గు పడొద్దు.. అలా చేస్తే వెంటనే కోటీశ్వరులు అవుతారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakya Neeti : భార్యాభర్తలు రాత్రి పూట సిగ్గు వదిలేసి ఈ పని చేయడానికి అస్సలు సిగ్గు పడొద్దు.. అలా చేస్తే వెంటనే కోటీశ్వరులు అవుతారు

 Authored By kranthi | The Telugu News | Updated on :22 November 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  స్త్రీ పురుషులు అయినా సిగ్గు లేకుండా ఈ పనులు చేస్తే వాళ్ల ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం ఉంటుంది

  •  డబ్బు సంపాదనలో అస్సలు సిగ్గుపడకూడదు

  •  మొహమాట పడితే మీరే సమస్యల్లో పడతారు

Chanakya Neeti : భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండాలంటే.. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉండాలి. అది లేకపోతే కష్టం. భార్యాభర్తలు అంటేనే వాళ్ల మధ్య అన్యోన్యత ఉండాలి. లేకపోతే కష్టం. ఏదైనా చిన్న సమస్య రాగానే.. భార్య గానీ.. భర్త గానీ టెన్షన్ పడిపోయి.. తమ బంధాన్ని సమస్యల్లో నెట్టేసుకుంటారు. అందుకే భార్యాభర్తలు అస్సలు గొడవ పడకూడదు. ఎలాంటి సమస్యలు వచ్చినా ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవాలి. కొందరు కష్టాలు రాగానే భయపడిపోయి తాము అసమర్థులం అని అనుకుంటారు. అటువంటి వాళ్లు ఒక్కసారి ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. నిజానికి చాణక్య నీతిలో మనిషి ఎలా జీవించాలి అనేదానిపై చాలా సలహాలు ఉన్నాయి. అందులో కొన్ని భార్యాభర్తలకు కూడా వర్తిస్తాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

ముఖ్యంగా భార్యాభర్తలు అయినా.. స్త్రీ పురుషులు అయినా సిగ్గు లేకుండా ఈ పనులు చేస్తే వాళ్ల ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం ఉంటుంది. డబ్బు సంపాదించడం కోసం కొందరు సిగ్గు పడుతుంటారు. నిజానికి ఏ పని అయినా నిజాయితీగా చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు. దానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. చాయి అమ్ముకొని కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకే డబ్బు సంపాదనలో అస్సలు సిగ్గుపడకూడదు. సిగ్గు, మొహమాటం పడితే డబ్బు సంపాదించడం కష్టం. కొందరు అయితే.. డబ్బు వేరేవాళ్లకు ఇచ్చి తిరిగి అడగడానికి కూడా సిగ్గు పడుతుంటారు. అలా అస్సలు చేయకూడదు. మీ డబ్బు కానీ.. వస్తువులను కానీ వేరే వాళ్లకు ఇస్తే వాటిని తగిన సమయంలో తిరిగి వసూలు చేసుకోవాలి. మొహమాట పడితే మీరే సమస్యల్లో పడతారు.

Chanakya Neeti : గురువుల నుంచి విద్య నేర్చుకోవడంలో సిగ్గు పడకండి

మొహమాటం మీకు అలవాటు అయితే మీ జీవితమే సమస్యల్లో పడుతుంది. మన జీవితం బాగుండాలంటే ఆ మొహమాటాలను వదిలేయాలి. గురువులు చెప్పినప్పుడు వినాలి. పిల్లలు టీచర్ల నుంచి విద్య నేర్చుకోవడానికి సిగ్గు పడితే జీవితమే పోతుంది. వాళ్లు సరిగ్గా చెప్పకున్నా.. ఎలాంటి అనుమానాలు ఉన్నా అడిగి మరీ చెప్పించుకోవాలి. కొందరైతే తిండి విషయంలోనూ సిగ్గు పడుతుంటారు. తిండి కోసం అస్సలు సిగ్గుపడొద్దు. తిండి తింటేనే ఏదైనా పని చేయగలుగుతాం. కడుపు నిండితేనే ఎనర్జీ వస్తుంది. అందుకే ఆకలిగా అనిపిస్తే తినండి.. ఆ విషయంలో సిగ్గుపడకండి అని చాణక్యుడు చెప్పారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది