Chandrababu : చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఈ సారి ఆ విషయాలపై స్పెషల్ ఫోకస్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఈ సారి ఆ విషయాలపై స్పెషల్ ఫోకస్..

 Authored By mallesh | The Telugu News | Updated on :25 October 2021,3:40 pm

Chandrababu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశాడు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా, వ్యూహకర్తగా, అపర చాణక్యుడిగా పేరుంది. కానీ, ఆ తర్వాత కాలంలో ఆయన అధినాయకత్వంలోని రాజకీయ పార్టీ టీడీపీకి ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. విభజిత ఏపీలో ఒకసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు అయిపోయారు. టీడీపీ 2019 సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయింది. ఈ క్రమంలోనే టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగాను చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Chandrababu

Chandrababu

కానీ ఆ తర్వాత కాలంలో ఆ రెండు పార్టీలతో పొత్తు నుంచి టీడీపీ దూరమయింది. అయితే, ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపి రాష్ట్రవ్యాప్త పొత్తుకు ఆలోచనలు చేస్తున్నారట చంద్రబాబు. తద్వారా టీడీపీ పార్టీపై కమ్మ సామాజిక వర్గ ముద్రను తొలగించొచ్చనేది టీడీపీ అధినేత భావన. ఈ క్రమంలోనే కాపు, కమ్మ కాంబినేషన్‌లో పొలిటికల్‌గా టీడీపీ బాగా స్ట్రాంగ్ అయి మళ్లీ అధికారంలోకి రావచ్చని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీపై విమర్శలు చేయొద్దని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పట్టాభి ఎపిసోడ్ తర్వాత ఈ నిర్ణయాలను చంద్రబాబు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Chandrababu : మళ్లీ చక్రం తిప్పేందుకు చంద్రబాబు సన్నాహకాలు..!

వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో జాగ్రత్తలు వహించాలని సూచించినట్లు వినికిడి. మొత్తంగా కమ్మ సామాజికి వర్గానికి చెందిన నేతలను కొంత కాలం పాటు పక్కనబెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం. మీడియా ఎదుటకు వచ్చే నేతల్లో కింజారపు రామ్మోహన్ నాయుడు, ఉమా మహేశ్వర్ రావు, అశోక్ గజపతిరాజు, అమర్‌నాథ్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, రామకృష్ణుడు యనమల, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య మాత్రమే ఉండాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు సూచించినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చూడాలి మరి… చంద్రబాబు ప్లాన్స్ ఏ మేరకు వర్కవుట్ అవుతాయో..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది