Chandrababu
Chandrababu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశాడు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా, వ్యూహకర్తగా, అపర చాణక్యుడిగా పేరుంది. కానీ, ఆ తర్వాత కాలంలో ఆయన అధినాయకత్వంలోని రాజకీయ పార్టీ టీడీపీకి ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. విభజిత ఏపీలో ఒకసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు అయిపోయారు. టీడీపీ 2019 సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయింది. ఈ క్రమంలోనే టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగాను చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Chandrababu
కానీ ఆ తర్వాత కాలంలో ఆ రెండు పార్టీలతో పొత్తు నుంచి టీడీపీ దూరమయింది. అయితే, ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపి రాష్ట్రవ్యాప్త పొత్తుకు ఆలోచనలు చేస్తున్నారట చంద్రబాబు. తద్వారా టీడీపీ పార్టీపై కమ్మ సామాజిక వర్గ ముద్రను తొలగించొచ్చనేది టీడీపీ అధినేత భావన. ఈ క్రమంలోనే కాపు, కమ్మ కాంబినేషన్‌లో పొలిటికల్‌గా టీడీపీ బాగా స్ట్రాంగ్ అయి మళ్లీ అధికారంలోకి రావచ్చని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీపై విమర్శలు చేయొద్దని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పట్టాభి ఎపిసోడ్ తర్వాత ఈ నిర్ణయాలను చంద్రబాబు తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో జాగ్రత్తలు వహించాలని సూచించినట్లు వినికిడి. మొత్తంగా కమ్మ సామాజికి వర్గానికి చెందిన నేతలను కొంత కాలం పాటు పక్కనబెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం. మీడియా ఎదుటకు వచ్చే నేతల్లో కింజారపు రామ్మోహన్ నాయుడు, ఉమా మహేశ్వర్ రావు, అశోక్ గజపతిరాజు, అమర్‌నాథ్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, రామకృష్ణుడు యనమల, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య మాత్రమే ఉండాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు సూచించినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చూడాలి మరి… చంద్రబాబు ప్లాన్స్ ఏ మేరకు వర్కవుట్ అవుతాయో..
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.