chandrababu
Chandrababu : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకనాడు అధికారంలో ఉన్న టీడీపీ నేడు ఏపీలో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. తెలంగాణలో టీడీపీ అనేది దాదాపుగా లేకుండా పోయింది. నేతలు, కార్యకర్తలు దాదాపుగా వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఏపీలోని వాస్తవ పరిస్థితులపై అంచనా వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను మాస్టర్ ప్లాన్ వేశారు.టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి డిఫరెంట్ ప్లాన్ వేసినట్లు సమాచారం.
chandrababu
అందులో భాగంగానే ఏపీలోని నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను రెండేళ్ల ముందరే పరిచయం చేసి, ప్రచారం చేయాలాని భావిస్తున్నారట. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వకపోయినప్పటికీ పార్టీలో కష్టపడి పని చేస్తున్న వారికి టికెట్లు దాదాపుగా ఖరారు అవుతాయని చంద్రబాబు సంకేతాలు పంపినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకుగాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ మెయిన్ ఆఫీసులో నియోజకవర్గాల వారిగా నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారట. వాటి ఆధారంగా నియోజకవర్గ ఇన్‌చార్జులను నియమించి, వారికే టికెట్ ఇవ్వబోతున్నట్లు సమచారం. అయితే, ఇన్‌చార్జులుగా ఉన్న వారందరికీ డైరెక్ట్‌గా టికెట్లు ఇస్తారనుకుంటే సరి కాదు.
tdp
వారు పార్టీ కోసం, ప్రజల కోసం జరిపే కార్యక్రమాలు, పని తీరు ఆధారంగా టికెట్లు ఇస్తారట టీడీపీ చీఫ్. గతంలో మాదిరిగా అభ్యర్థుల ఎంపిక కోసం ఉండే స్క్రీనింగ్ కమిటీలు ఈ సారి ఉండబోవని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారట. నియోజకవర్గ ఇన్‌చార్జుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి, పని తీరు సరిగా లేకపోతే వారిని ఆ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగిస్తామని చంద్రబాబు స్పష్టంగా పేర్కొన్నట్లు టీడీపీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మొత్తంగా టీడీపీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయ అధికారం సాధించాలని, అందుకుగాను రెండేళ్ల ముందు నుంచే పకడ్బందీగా పార్టీ కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.