Pragathi : తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్‌కు కొదువ లేదు. పరిశ్రమలో అడుగుపెట్టి అవకాశాల కోసం వెతికే కుర్ర హీరోయిన్లకు ఎక్కడో చోట చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని కొందరు మాయమాటలు చెప్పి కుర్రహీరోయిన్లను బుట్టలో వేసుకుంటారు. అలాంటి వారిలో దర్శకనిర్మాతలు, స్టార్స్ కూడా ఉంటారని ఇదివరకే కొందరు సెలబ్రిటీలు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఉందని దీనికి కొందరు దర్శకనిర్మాతలు ఎంకరేజ్ చేస్తున్నారని ఆ మధ్యలో పెద్ద రచ్చే జరిగింది.
Character Artist Pragathi Comments About Casting Couch
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వేళ్లూనుకపోయిందని నటి శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేసింది. అవకాశాల పేరుతో తనను చాలా మంది వాడుకున్నారని ఆరోపించింది. కానీ వారి పేర్లు బయటపెట్టలేదు. సినీ పెద్దలు ఈ విషయంలో స్పందించాలంటూ ఫిలిం ఇండస్ట్రీలో అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది. తాజాగా శ్రీరెడ్డి వ్యాఖ్యలు కేవలం ఆరోపణలు మాత్రం కాదని మరో సీనియర్ నటి ప్రూవ్ చేసింది. ఆవిడ మరెవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి.. ఈమెను ఇండస్ట్రీలో అంతా ప్రగత ఆంటీ అని పిలుచుకుంటారు. కానీ ఈవిడకు ఆంటీ అంటే బహుచిరాకు వస్తుందట..
ప్రగతి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఏజ్‌తో సంబంధం లేకుండా హీరోయిన్లతో పోటీ పడి మరీ యాక్టింగ్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగతి ఈ ఏజ్ లోనూ ఫిజిటల్ ఫిట్ నెస్ కోసం తెగ వర్కౌట్స్ చేస్తుంది. టైం ఉన్నప్పుడల్లా డ్యాన్సింగ్ వీడియోలను షేర్ చేస్తుంది. ప్రగతికి ఫాన్ ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. కెరీర్ మొదట్లో హీరోయిన్‌గా నటించిన ప్రగతి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడింది. తాజాగా ప్రగతి ఆంటీ ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన ఆమె ఓ స్టార్ హీరో తనను కమిట్ మెంట్ అడిగాడని గుర్తుచేసుకుంది. తనతో పక్కలోకి వస్తే సినిమా అవకాశాలు ఇప్పిస్తానని అన్నాడని ఒక్కసారిగా బాంబ్ పేల్చింది. కానీ పేరు మాత్రం చెప్పలేదు. చూడాలి మరి దీనిపై ఇండస్ట్రీ ఏవిధంగా స్పందిస్తుందో..
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.