Chicken Tandoori Recipe : ఒకే ఒక టేబుల్ స్పూన్ నూనెతో తందూరి చికెన్.. బొగ్గు, ఒవేన్ తో పనిలేదు… వీడియో !

Chicken Tandoori Recipe  : ఈరోజు మంచి స్మోకింగ్ ఫ్లేవర్ తో తందూరి చికెన్ ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూపించబోతున్నాను. ఈ చికెన్ ని రోస్ట్ చేసుకోవడం కోసం జస్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ యూస్ చేస్తామండి. దాంతో పాటు కొద్దిగా బటర్ అంతే ఎక్కువ ఆయిల్ ని యూస్ చేయము. చాలా చాలా ఈజీ వే లో చెప్తున్నానండి. తందూరి చికెన్ ని ఇలా మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హోటల్ లో తిన్నా కూడా మీకు ఫీల్ అనేది రానే రాదు.. తందూరి చికెన్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీస్ లు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు నిమ్మరసం, కసూరి మేతి, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, ఆయిల్ బటర్ మొదలైనవి..  తయారీ విధానం; చికెన్ లెగ్ పీస్ లను డీప్ గా గాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ కి ఒక నిమ్మ చెక్కని రసాన్ని పిండి వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు బాగా మసాజ్ చేయాలి. నిమ్మ రసాన్ని ఉప్పుని కూడా లెగ్ పీసెస్ కి బాగా పట్టించాలండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు తందూరి మసాలాను తయారు చేసుకుందామండి. దానికోసం ఫస్ట్ ఒక పల్చటి క్లాత్ తీసుకుని అందులోకి ముప్పావు కప్పు దాకా చిక్కటి పెరుగు ని యాడ్ చేసుకోండి.

పెరుగుని ఒక వెడల్పుగా ఉండే బౌల్ లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టీ స్పూన్ల దాకా కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ దాకా పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే అర టీ స్పూన్ దాకా తందూరి మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మెతి తీసుకుని కొద్దిగా క్రష్ చేసుకుని ఆడ్ చేసుకోండి. అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు నిమ్మరసం కలిపి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ ని ఆడ్ చేసుకుని మసాలా మొత్తాన్ని కూడా చికెన్ లెగ్ పీసెస్ కి లోపలి వరకు కోరుతూ అంతా కూడా బాగా అప్లై చేయండి. ఈ చికెన్ లెగ్ పీసెస్ కి మసాలాని బాగా పట్టించేసి వన్ అవర్ పాటు ప్రిజర్ లో ఉంచండి.. ఈ చికెన్ మ్యారినేట్ అయ్యే లోపు మనం గ్రీన్ చట్నీ ఫటాఫట్ తయారు చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు దాకా పుదీనా ఆకులు, అరకప్పు దాకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఇందులోకి పావు ఇంచుదాక అల్లాని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం వేసి మెత్తని పేస్టులా పట్టి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని బయటికి తీసేసి ఈ చికెన్ ని రోస్ట్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉండే పాన్ పెట్టుకోండి. ఈ పాన్ లో ఆయిల్ ఏమీ వేయకుండా డైరెక్ట్ గా మీరు ఈ లెగ్ పీసెస్ ని వేసేసేయండి.

అలాగే బౌల్ లో ఉండే మసాలా మొత్తాన్ని కూడా పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి ఈ మసాలా అంతా కూడా చికెన్ లెగ్ పీసెస్ కి బాగా పట్టేటట్టుగా అటు ఇటు కూడా రోస్ట్ చేసుకుంటూ అడుగు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. అలాగే చికెన్ అనేది లైట్ గా డ్రై అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి. బటర్ వేసిన తర్వాత బటర్ అంతా కరిగి ఈ ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి చికెన్ నుంచి వాటర్ అనేది రాని రాదన్నమాట.. ఈ చికెన్ అనేది కంప్లీట్ గా కుక్ అయ్యేలోపు దీనికి తందూరి ఫ్లేవర్ తీసుకోవడం కోసం నేను టిప్స్ ని చెప్తాను అని చెప్పాను. ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు చిప్ప దొరుకుతుంది కదా. చికెన్ అనేది కంప్లీట్ గా కుక్ అయిపోవాలండి. ఇలా మొత్తం చికెన్ చక్కగా సాఫ్ట్ గా లోపల వరకు కుక్ అయిపోయిన తర్వాత ముక్కలను జరుపుకొని సెంటర్లోకి ఒక చిన్న బౌల్ పెట్టుకోండి. అందులోకి కొబ్బరి చిప్పల్ని కాల్చి బొగ్గుగా అయిన తర్వాత నిప్పు ఉన్నప్పుడే ఈ చిప్పల్ని బౌల్లోకి వేసేసేయండి. బౌల్లో వేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బటర్ ఉంటే బటర్ వేయండి. లేదంటే నెయ్యి గాని నూనెను గాని వేసుకోవచ్చు. ఇలా బటర్ వేసిన వెంటనే మన మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసేయాలి. స్మోక్ అనేది బయటికి పోకూడదు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక చిన్న ఫైనల్ టచ్ మాత్రమే మిగిలింది. రోస్ట్ చేసేసుకున్న చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా తీసుకుని బర్నర్ మీద పెట్టుకొని కాలుచుకోవాలి.. అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది చికెన్ లోపలి వరకు బాగా వెళుతుంది. అలాగే పైన కూడా మనకి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలాగే ని కూడా కొద్దిగా ఫ్లేమ్ మీద అటు ఇటు లైట్ గా కాల్చుకుని మనం తయారుచేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ తో సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.

 

Recent Posts

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

12 minutes ago

Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ స‌మ‌స్య ఉంది.. ఆమె పెద్ద ప్ర‌మాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు

Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…

1 hour ago

Viral Video : రాజన్న సిరిసిల్ల లో అరుదైన దృశ్యం.. శివలింగం ఆకారంలో చీమల పుట్ట..!

Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…

2 hours ago

Nara Lokesh : ఏపీకి బాబు బ్రాండ్ తీసుకొస్తుంటే.. వైసీపీ చెడగొడుతుందంటూ లోకేష్ ఫైర్..!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌‌ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…

3 hours ago

Cricketer : న‌న్ను మోస‌గాడు అన్నారు.. ఆత్మ‌హత్య చేసుకోవాల‌ని అనుకున్నా.. క్రికెట‌ర్‌ కామెంట్స్..!

Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…

4 hours ago

Kingdom Movie Collections : హిట్ కొట్టిన కింగ్‌డమ్.. ఫ‌స్ట్ డే ఎంత వ‌సూలు చేసింది అంటే..!

Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‏డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…

5 hours ago

Super Food : ఇవి చూడగానే నోరుతుందని.. తింటే తీయగా ఉంటుందని…తెగ తినేస్తే మాత్రం బాడీ షెడ్డుకే…?

Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…

6 hours ago

Apple Peels : యాపిల్ తొక్కల్ని తీసి పడేస్తున్నారా… దీని లాభాలు తెలిస్తే ఆ పని చేయరు…?

Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…

7 hours ago