Chiranjeevi : మత్య్సకారుడిగా చిరంజీవి.. ‘అన్నయ్య’ అరాచకం ప్రారంభం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : మత్య్సకారుడిగా చిరంజీవి.. ‘అన్నయ్య’ అరాచకం ప్రారంభం..!

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ‘ఆచార్య’ చిత్రం పూర్తి కాగానే ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న చిరంజీవి.. తాజాగా తన నెక్ట్స్ మూవీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ – మెగాస్టార్ చిరంజీవి కాంబో‌లో వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ‘మెగా 154’ మూవీ పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి. Chiranjeevi : ‘మాస్ మూల విరాట్’గా మెగాస్టార్.. డైరెక్టర్ […]

 Authored By praveen | The Telugu News | Updated on :6 November 2021,2:46 pm

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ‘ఆచార్య’ చిత్రం పూర్తి కాగానే ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న చిరంజీవి.. తాజాగా తన నెక్ట్స్ మూవీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ – మెగాస్టార్ చిరంజీవి కాంబో‌లో వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ‘మెగా 154’ మూవీ పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి.

Chiranjeevi : ‘మాస్ మూల విరాట్’గా మెగాస్టార్.. డైరెక్టర్ బాబీ ట్వీట్
‘మెగా 154’ ఫిల్మ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మూవీ యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులకు డైరెక్టర్ బాబీ ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాడు. ఈ క్రమంలోనే బాబీ ట్విటర్ట్ వేదికగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చేసిందంటూ చెప్తూ..‘మాస్ మూల విరాట్’గా డిఫరెంట్ అవతార్‌లో చిరంజీవిని చూపించబోతున్నట్లు పేర్కొన్నాడు బాబీ. ఈ సినిమాలో చిరంజీవి మత్స్యకారుడిగా ఫుల్ మాస్ గెటప్‌లో కనబడబోతున్నట్లు సమాచారం. చిరంజీవి ఫస్ట్ లుక్ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ ఫిల్మ్‌కు దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది