Viral Video :  విషాదంగా మారిన సెల్ఫీ సరదా .. ముగ్గురు టీనేజ్ బాలికల మృతి ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :10 April 2026,10:00 am

ప్రధానాంశాలు:

  •  Viral Video :  విషాదంగా మారిన సెల్ఫీ సరదా .. ముగ్గురు టీనేజ్ బాలికల మృతి ..!

Viral Video :  అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెలవులను సరదాగా గడపాలని వెళ్లిన నాలుగు స్నేహితురాళ్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. హుకుంపేట మండలం జంబువలస గ్రామానికి చెందిన త్రిష (17), పవిత్ర (16), రత్నకుమారి (16), అంజలి Trish (17), Ratnakumari (16), Pavitra (16)  అనంతగిరి మండలం మలుంగుమ్మి జలపాతం సందర్శనకు వెళ్లారు. ప్రకృతి సోయగాల మధ్య ఆనందంగా గడిపిన వారు మొదట కొండ అంచున నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సంతోషంగా గడిపారు. వేసవి వేడి కారణంగా నీళ్లలోకి దిగి మరింత సరదాగా సమయం గడిపారు.

Viral Video :  విషాదంగా మారిన సెల్ఫీ సరదా .. ముగ్గురు టీనేజ్ బాలికల మృతి ..!

Viral Video :  విషాదంగా మారిన సెల్ఫీ సరదా .. ముగ్గురు టీనేజ్ బాలికల మృతి ..!

Viral Video :  సెల్ఫీ తీస్తూ ప్రమాదంలో చిక్కుకున్న స్నేహితులు

సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. ఒక బాలిక జారి నీటిలో పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మిగతా ముగ్గురు కూడా వరుసగా జలపాతంలోకి జారిపోయారు. అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించి నీటిలోకి దిగి వారిని బయటకు తీశారు. అయితే అప్పటికే త్రిష, పవిత్ర, రత్నకుమారి ఊపిరాడక మృతి చెందారు. అంజలి గాయాలతో ప్రాణాలతో బయటపడింది. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారే కావడం గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది.

Viral Video : జాగ్రత్తల లోపం ప్రాణాంతకమవుతుంది

ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా ఆనందంగా గడిపిన క్షణాలు ఒక్కసారిగా శోకంగా మారాయి. పోలీసులు ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సెల్ఫీలు తీసే సమయంలో నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతోందని సూచించారు. ఈత రాని వారు లోతైన నీటిలోకి దిగరాదని అవసరమైతే రక్షణ పరికరాలు ఉపయోగించాలని చెప్పారు. వేసవికాలంలో జలాశయాలు, చెరువులు, జలపాతాల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద విషాదాలకు దారి తీస్తుందని అధికారులు హెచ్చరించారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి