Megastar : నాకు రాజమౌళి అంటే ఇష్టమే.. కానీ అతనితో సినిమా చేయనన్న చిరంజీవి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Megastar : నాకు రాజమౌళి అంటే ఇష్టమే.. కానీ అతనితో సినిమా చేయనన్న చిరంజీవి

 Authored By mallesh | The Telugu News | Updated on :1 October 2022,6:00 pm

Megastar : మెగాస్టార్ చిరంజీవి దర్శకధీరుడు రాజమౌళిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. జక్కన్న అంటే ఇష్టమే కానీ అతనితో నేను సినిమాలు చేయలేనని చిరంజీవి అన్నారు. ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెను దుమారం రేగుతోంది. మెగాస్టార్ చిరు స్టార్ డైరెక్టర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని అంతా మాట్లాడుకుంటున్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ( Godfather ) మూవీకి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు ముగించుకుని ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇది మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌కు రీమెక్.. మళయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించగా..తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ( chiranjeevi ) హీరోగా కనిపించనున్నారు. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.గాడ్ ఫాదర్ మూవీని బాలీవుడ్‌లో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట..అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. నయనతార, దర్శకుడు పూరిజగన్నాథ్, సునీల్, సత్యదేవ్, అనసూయ వంటి యాక్టర్లు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

i like rajamouli but chiranjeevi wont do a movie with him

i like rajamouli but chiranjeevi wont do a movie with him

Megastar : చిరు ఇలా ఎందుకు అన్నారంటే..

ఈ క్రమంలోనే చిరంజీవి దర్శకధీరుడు రాజమౌళిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జక్కన్న స్టార్ దర్శకుడు. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు. ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. కానీ ఆయన డైరెక్షన్‌లో సినిమా చేయాలనే కోరిక లేదన్నారు. ఎందుకంటే రాజమౌళి ప్రతి విషయాన్ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తారు. ఆయనకు నచ్చినట్టు నేను ఔట్ పుట్ ఇవ్వగలనో లేదో నాకు తెలీదు.ఒకసినిమాకు ఆయన రెండు నుంచి మూడేళ్లు ట్రావెల్ చేస్తారు. కానీ నేను ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది