if-you-deposit-one-hundred-rs-3000-pension-this-central-scheme-is-only-for-them
Pension Scheme : కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పెన్షన్ పథకాలు లేకపోవడంతో వృద్దాప్యంలో కొంత భరోసా కల్పించేందుకు ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన (PM SYM) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అసంఘటిత కార్మికులు కూడా రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా రూ. 3000 పెన్షన్ గా పొందొచ్చు. ఇందుకోసం ప్రతి నెలా కొంత మొత్తంలో తమ అకౌంట్లో డిపాజిట్ చేస్తే సరిపోతుంది.
if-you-deposit-one-hundred-rs-3000-pension-this-central-scheme-is-only-for-them
ఈ పథకం చిన్నవ్యాపారులు, దుకాణదారులు, కార్మికులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరేవారు అంటే 18 సంవత్సరాలు నిండిన వారు రూ.55, 29 ఏళ్లు నిండినవారు రూ.100, 40 ఏళ్లు నిండిన వారు రూ.200 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డిపాజిట్ కు కేంద్రం 50-50 ప్రాతిపదికన అమౌంట్ జమచేస్తుంది. అంటే లబ్దిదారుడు రూ.100 జమచేస్తే కేంద్రం మరో 100 రూపాయలు జమ చేస్తుంది. ఈ మొత్తం అమౌంట్ లబ్దిదారుడికి 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతినెలా రూ. 3000 వేలు పెన్షన్ రూపంలో వస్తుంది. అంటే యేటా రూ.36000 వస్తుంది. పథకం వ్యవధిలో లబ్ధిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి 50 శాతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది. ఫ్యామిలీ పెన్షన్ కేవలం జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది.
ఈ పథకంలో చేరాలనుకుంటే సమీపంలో డిజిటల్ సేవాకేంద్రానికి లేదా జన్ సేవా కేంద్రానికి వెళ్లాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కార్డు కూడా పొందవచ్చు. మొదటగా రూ.100 డిపాజిట్ చేయలనుకుంటే మొదటి డిపాజిట్ ను డిజిటల్ సేవా కేంద్రాల్లో చెల్లించాలి. ఆతర్వాత ప్రతి నెలా లబ్దిదారుడి అకౌంట్ నుండి ఆటో డెబిట్ ద్వారా అమౌంట్ డిపాజిట్ అవుతుంది. లబ్దిదారుడు 60 ఏళ్లు వచ్చేవరకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతినెలా సక్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పెన్షన్ అందుతుంది.
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
This website uses cookies.