Pension Scheme : వంద డిపాజిట్ చేస్తే.. రూ.3000 పెన్ష‌న్.. ఈ సెంట్ర‌ల్ స్కీమ్ వాళ్ల‌కి మాత్ర‌మే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pension Scheme : వంద డిపాజిట్ చేస్తే.. రూ.3000 పెన్ష‌న్.. ఈ సెంట్ర‌ల్ స్కీమ్ వాళ్ల‌కి మాత్ర‌మే

Pension Scheme : కేంద్ర ప్ర‌భుత్వం అసంఘ‌టిత రంగాల్లో ప‌నిచేసే వారికి పెన్ష‌న్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పెన్షన్ ప‌థకాలు లేకపోవడంతో వృద్దాప్యంలో కొంత భ‌రోసా క‌ల్పించేందుకు ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన (PM SYM) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అసంఘటిత కార్మికులు కూడా రిటైర్మెంట్ తర్వాత ప్ర‌తి నెలా రూ. 3000 పెన్షన్ గా పొందొచ్చు. ఇందుకోసం ప్రతి నెలా కొంత మొత్తంలో త‌మ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :28 April 2022,8:30 pm

Pension Scheme : కేంద్ర ప్ర‌భుత్వం అసంఘ‌టిత రంగాల్లో ప‌నిచేసే వారికి పెన్ష‌న్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పెన్షన్ ప‌థకాలు లేకపోవడంతో వృద్దాప్యంలో కొంత భ‌రోసా క‌ల్పించేందుకు ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన (PM SYM) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అసంఘటిత కార్మికులు కూడా రిటైర్మెంట్ తర్వాత ప్ర‌తి నెలా రూ. 3000 పెన్షన్ గా పొందొచ్చు. ఇందుకోసం ప్రతి నెలా కొంత మొత్తంలో త‌మ అకౌంట్లో డిపాజిట్ చేస్తే స‌రిపోతుంది.

if you deposit one hundred rs 3000 pension this central scheme is only for them

if-you-deposit-one-hundred-rs-3000-pension-this-central-scheme-is-only-for-them

ఈ ప‌థ‌కం చిన్న‌వ్యాపారులు, దుకాణ‌దారులు, కార్మికులు స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కంలో చేరేవారు అంటే 18 సంవ‌త్స‌రాలు నిండిన వారు రూ.55, 29 ఏళ్లు నిండిన‌వారు రూ.100, 40 ఏళ్లు నిండిన వారు రూ.200 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డిపాజిట్ కు కేంద్రం 50-50 ప్రాతిప‌దిక‌న అమౌంట్ జ‌మ‌చేస్తుంది. అంటే ల‌బ్దిదారుడు రూ.100 జ‌మ‌చేస్తే కేంద్రం మ‌రో 100 రూపాయ‌లు జ‌మ చేస్తుంది. ఈ మొత్తం అమౌంట్ ల‌బ్దిదారుడికి 60 ఏళ్లు వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తినెలా రూ. 3000 వేలు పెన్ష‌న్ రూపంలో వ‌స్తుంది. అంటే యేటా రూ.36000 వ‌స్తుంది. ప‌థ‌కం వ్య‌వ‌ధిలో ల‌బ్ధిదారుడు మ‌ర‌ణిస్తే జీవిత భాగస్వామికి 50 శాతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది. ఫ్యామిలీ పెన్షన్ కేవలం జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది.

ఈ ప‌థ‌కంలో చేరాల‌నుకుంటే స‌మీపంలో డిజిట‌ల్ సేవాకేంద్రానికి లేదా జ‌న్ సేవా కేంద్రానికి వెళ్లాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ వివ‌రాల‌తో రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు. అలాగే ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కార్డు కూడా పొంద‌వ‌చ్చు. మొద‌ట‌గా రూ.100 డిపాజిట్ చేయ‌ల‌నుకుంటే మొద‌టి డిపాజిట్ ను డిజిట‌ల్ సేవా కేంద్రాల్లో చెల్లించాలి. ఆత‌ర్వాత ప్ర‌తి నెలా ల‌బ్దిదారుడి అకౌంట్ నుండి ఆటో డెబిట్ ద్వారా అమౌంట్ డిపాజిట్ అవుతుంది. ల‌బ్దిదారుడు 60 ఏళ్లు వ‌చ్చేవ‌ర‌కు ఎలాంటి అంత‌రాయం లేకుండా ప్ర‌తినెలా స‌క్ర‌మంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాతే పెన్ష‌న్ అందుతుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది