YS Jagan : విజయసాయిరెడ్డి విషయంలో సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం? ఎవ్వరూ ఊహించనిది?
YS Jagan : వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి త్వరలో తన కేబినెట్ మార్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రివర్గ కూర్పు, మార్పులపైన దృష్టి పెట్టినట్లు సమాచారం. ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రజెంట్ ఏపీ మంత్రి వర్గంతో పాటు పార్టీ ఇన్‌చార్జుల వ్యవహారం చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించేటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఏపీ సీఎం జగన్ మొదటి నుంచి తనదైన శైలిలో పాలిటిక్స్ చేస్తున్నారు. తనకు నచ్చిన వ్యక్తులకు అవకాశాలిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వ పథకాలతో పాటు పార్టీ వ్యవహారాల్లో జగన్ తీసుకునే నిర్నయాలు యూనిక్‌గా ఉంటాయని వైసీపీ వర్గాలు చెప్తుంటాయి. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని తొలగించి ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నియమించబోతున్నట్లు వినికిడి. ఈ మేరకు వైసీపీ అధిష్టానం వేమిరెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇకపోతే కార్యనిర్వాహక రాజధానిగా ఉన్న విశాఖపట్నంలో వైసీపీలోనే విజయ సాయిరెడ్డికి వ్యతిరేక వర్గాలున్నాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిపై వేటు వేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు పలువురు అనుకుంటున్నారు.
YS Jagan : ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా ఉన్న విజయసాయిరెడ్డిపై వేటు?
వైసీపీ నేతలు ఇటీవల విశాఖటపట్నంలో ఓ సమావేశం పెట్టుకోగా, తనను సంప్రదించుకుండానే మీటింగ్ కండక్ట్ చేసుకోవడం పట్ల విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి జోష్ తగ్గించేందుకుగాను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక విజయసాయిరెడ్డి సైతం ఒకప్పుడు ఉన్నంత యాక్టివ్‌గా ఇప్పుడు ఉండటం లేదు. తన దూకుడును కాస్త తగ్గించినట్లు అర్థమవుతున్నది. అవినీతికి ఆమడ దూరంలో తాను ఉంటానని ఇటీవల విజయసాయిరెడ్డి మాట్లాడారు కూడా. ఆ మాటలను బట్టి విజయసాయిరెడ్డి ప్రజెంట్ ఆత్మరక్షణలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఒకప్పుడు వైసీపీలో జగన్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ తనదే అనేంతాల విజయసాయిరెడ్డి వ్యవహరించారు. కాని ఇప్పుడు అటువంటి పొజిషన్ లేదు. జగన్ తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్లుగా ఉంది పరిస్థితి అని పలువురు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి.. మంత్రి వర్గం, విజయసాయిరెడ్డి విషయమై జగన్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారో మరి..