Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం. అది ఉంటేనే కూరకు టేస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డల్లోనూ తెల్లవి, ఎర్రవి ఉంటాయి. వాటిలో ఏది తీసుకున్నా ఓకే కానీ.. ఎర్ర ఉల్లిపాయల్లో కొన్ని నల్లని మచ్చలు, నల్లని పొడితో కలిసి వస్తుంటాయి. వాటి మీద నల్లని చారలు ఏర్పడుతాయి.
#image_title
అలా ఉల్లిగడ్డలపై నల్లని పొడి కనిపించినా, నల్లని మచ్చలు కనిపించినా అది ఫంగస్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లిగడ్డలపై బూజు వచ్చి అలాగే పేరుకుపోతే అవి నల్లగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
అలా నల్లని చారలు ఉన్న ఉల్లిగడ్డలు కనిపిస్తే వాటిని శుభ్రంగా కడుక్కొని తినాలి. నల్లటి మరకలను అలాగే ఉంచి కట్ చేసి తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. దాంట్లో నుంచి మైక్రో విషాలు విడుదలవుతాయి. అవి కిడ్నీ సమస్యలను తీసుకొస్తాయి. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే నల్లని పొడి, మచ్చలతో ఉన్న ఉల్లిగడ్డలను తినకండి. ఒకవేళ అవి ఉంటే వాటిని శుభ్రంగా కడుక్కొని కూరల్లో వేసుకోవడం బెటర్.