Pawan Kalyan : చిక్కుల్లో జనసేన.. గుర్తు ఉండేనా? పోయేనా?
Pawan Kalyan : జనసేన పార్టీకి ఎన్నికల పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. గత ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీచేసింది జనసేన. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. అయితే, రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. జనసేనకు ఓటింగ్ శాతం కూడా తక్కువగానే వచ్చింది. వైసీపీ బ్రహ్మాండమైన సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఈ సంగతులు పక్కనబెడితే గత కొద్ద కాలంగా పవన్ కల్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో కేంద్ర బిందువు అయిపోయారు.
Pawan Kalyan : జనసేనకు పెద్ద దెబ్బ.. !
అధికార వైసీపీ ప్రభుత్వం, మంత్రులపై తీవ్రస్థాయిలోనే పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌పైన విమర్శలు చేస్తున్నారు. కాగా, పవన్ కల్యాణ్ పార్టీకి మరో సమస్య ఈ సారి ఎన్నికల్లో వస్తుందట. అదేంటంటే.. జనసేన పార్టీ సింబల్ గాజుగ్లాసు మారిపోవడం.. కేంద్ర ఎన్నికల కమిషన్ స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు సింబల్ కేటాయిస్తున్నది. ఈ క్రమంలో జనసేన పార్టీకి ఇబ్బందులొస్తాయని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవల ఎన్నికల సంఘం గాజుగ్లాసు సింబల్‌ను ఫ్రీ సింబల్ కేటగిరిలోకి చేర్చింది. దాంతో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తు రానుంది. ఇలా జరిగితే పవన్ కల్యాణ్ పార్టీకి నష్టం జరగొచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇటీవల ఏపీలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేయాల్సిన అవసరం లేదని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీకి ఈ సింబల్ కేటాయించినప్పటికీ ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల టైంలో జనసేనాని పవన్ కల్యాణ్ గాజు గ్లాసును సింబల్‌గా ప్రచారం చేశారు. ఈ గుర్తును జనంలోకి తీసుకెళ్లి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇకపోతే జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును రిజర్వ్ చేయాలని జనసేన తరఫున ఎన్నికల కమిషన్‌ను సంప్రదించాలని జనసేన నాయకులు నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ ఎన్నికల సంఘం ఆ గుర్తును తిరిగి కేటాయించబోనట్లయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకుగాను జనసేన నేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.