Home » News » Kcr Cm Kcr Challenge To Bjp
News

KCR : ఒకే నిమిషంలో సీఎం పదవికి రిజైన్ చేస్తా.. బీజేపీకి కేసీఆర్ చాలెంజ్

Authored By
praveen T
The Telugu News | Updated on: November 8, 2021, 4:57 pm
Advertisement

KCR : వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఇటీవల బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై విమర్శల వర్షం కురిపించారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి కామెంట్స్‌పై స్పందించారు.

Advertisement

telangana cm kcr huzurabad by elction trs party

KCR : తెలంగాణ కోసం ఎన్నో సార్లు రాజీనామా చేశానన్న కేసీఆర్..

Advertisement

గొర్ల పైసలు కేంద్రంలోని బీజేపీనే ఇచ్చిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నిస్సిగ్గుగా మాట్లాడాడని కేసీఆర్ విమర్శించారు. కేంద్రమే కనుక గొర్లపైసలు ఇచ్చి ఉంటే తాను ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ కోసం తాను చాలాసార్లు రాజీనామా చేసి మళ్లీ గెలిచానని గుర్తు చేశారు కేసీఆర్. గొర్ల పథకం బీజేపీదే అయితే కర్నాటకలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బండి సంజయ్‌ను కేసీఆర్ హెచ్చరించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి జీహెచ్‌ఎంసీలో ఆ మాత్రం గెలిచారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క జిల్లా పరిషత్ అయినా బీజేపీ గెలిచిందా అని అడుగుతూ ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి