Manchi Rojulu Vachai Movie Review : ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ రివ్యూ..
Manchi Rojulu Vachai Movie Review : ‘ప్రతి రోజు పండగే’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న డైరెక్టర్ మారుతి ఆ తర్వాత తీసిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. డైరెక్టర్ మారుతి సినిమాలో కామెడీ ప్లస్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చాలా బాగుంటాయనే టాక్ ‘ప్రతి రోజు పండగే’ మూవీతో ప్రూవ్ చేశాడు. అప్పటి వరకు తీసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఆ సినిమా మరో రేంజ్ సినిమా అని ప్రేక్షకులు అనుకునేలా చేశాడు డైరెక్టర్ మారుతి. ఈ సంగతలు పక్కనబెడితే..‘ప్రతి రోజు పండగే’ చిత్రం తర్వాత మారుతి తెరకెక్కించిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఈ చిత్రం గురువారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
మూవీ : మంచి రోజులు వచ్చాయి
నటీ నటులు : సంతోష్ శోభన్, మెహ్రీన్, వెన్నెల కిషోర్, సప్తగిరి, అజయ్ ఘోష్
ప్రొడ్యూసర్స్ : వి సెల్యులాయిడ్, ఎస్‌కెఎన్
డైరెక్టర్ : మారుతి
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్
రిలీజ్ డేట్ : నవంబర్ 4, 2021
Manchi Rojulu Vachai Movie Review : మారుతి మార్క్ కామెడీ..
డైరెక్టర్ మారుతి సినిమా అనగానే ఎంచక్కా హ్యాపీగా నవ్వుకోవచ్చు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండగా, ఈ సినిమాకు అది వర్తిస్తుంది. స్టోరి విషయానికొస్తే..తిరుమల శెట్టి అలియాస్ గుండు గోపాల్ (అజయ్ ఘోష్) హీరోయిన్(మెహ్రీన్) తండ్రి. గుండు గోపాల్‌కు తన కుమార్తె పద్మ అలియాస్ పద్దు(మెహ్రీన్) అంటే చాలా ఇష్టం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే తన కూతురు పట్ల ఎంతో నమ్మకంగా ఉంటాడు. అయితే, పద్దు మాత్రం సంతోష్ (సంతోష్ శోభన్)తో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఈ సంగతి గుండు గోపాల్‌కు తెలియదు. కూతురు విషయంలో సంతోషంగానే ఉండగా, చుట్టు పక్కల వాళ్లు లేనిపోని భయాలు గుండుగోపాల్‌లో కలుగజేస్తారు. దాంతో గుండు గోపాల్ విపరీతంగా భయపడిపోతాడు. ఇంతో కరోనా కూడా వచ్చేస్తుంది. ఇన్ని చిక్కుల మధ్య గోపాల్‌ను పక్కనబెట్టి మరీ సంతోష్, పద్దు ఎలా ప్రేమించుకున్నారు? వారి ప్రేమాయణం ఎలా సాగింది ? అనేది సిల్వర్ స్క్రీన్‌పైన చూడాల్సిందే.
డైరెక్టర్ మారుతి రియల్ లైఫ్‌లోని కొందరి క్యారెక్టర్స్ తీసుకుని వాటిని వెండితెరపై ఆవిష్కరిస్తూ సక్సెస్ అవుతుంటారు. ఈ సినిమాలో అటువంటి రియల్ లైఫ్‌లో నుంచి తీసుకున్న అంశం ఫియర్. కరోనా మహమ్మారి నేపథ్యంలో వైరస్ గురించి చాలా మంది జనాలు భయపడగా.. ఆ భయాన్ని సినిమాలో చూపించడంతో పాటు కూతురి గురించి కూడా భయపడుతున్నట్టు చూపించాడు. మొత్తంగా సందర్భోచితంగా మారుతి పాత్రల మధ్య సృష్టించిన సగటు ప్రేక్షకుడి బాగా నచ్చుతుంది. అజయ్ ఘోష్ భార్య పాత్రతో పాటు సప్తగిరి, వెన్నెల కిషోర్ ఇతర సీజన్డ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కరోనా చుట్టూత కొద్దిసేపు సాగే ఫన్నీ కథాంశంగా మారుతి సబ్జెక్ట్‌ను డీల్ చేశాడు.
సగటు ప్రేక్షకుడిని కచ్చితంగా నవ్వించే సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. మూవీలో హీరో, హీరోయిన్ కంటే కూడా అజయ్ ఘోష్ పాత్రకే డైరెక్టర్ మారుతి బాగా ప్రయారిటీ ఇచ్చాడు. స్టోరి మొత్తం కూడా ఆయన చుట్టూత తిరుగుతుంది. అయితే, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు మారుతి. తక్కువ టైంలోనే ఈ సినిమాను మారుతి తెరకెక్కించాడు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకుగాను ఈ సినిమాను మారుతి తీశాడని ప్రేక్షకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్లస్ పాయింట్స్ : సినిమాలో కామెడీ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. భయం… నటించడం కష్టమే అయినప్పటికీ అజయ్ ఘోష్ అత్యద్భుతంగా నటించేశాడు. ఇక హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అయింది.
మైనస్ పాయింట్స్ : కథ పరంగా బాగనే ఉన్నప్పటికీ చాలా సీన్స్ సాగదీతలా అనిపిస్తాయి.
ట్యాగ్ లైన్ : మారుతి మార్క్ కామెడీతో పాటు ‘కడుపుబ్బ’ కాకపోయినా కచ్చితంగా నవ్వించే సినిమా..!