Mohan Babu : చాలాకాలానికి నన్ను లాగావు.. పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై మోహన్‌బాబు కౌంటర్..!
mohan babu : దేవ్ కట్టా డైరెక్షన్‌లో మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ మంత్రులు, సర్కారు, సినీ పెద్దలపై పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇకపోతే ఏపీ మంత్రులు ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇవ్వగా, తాజాగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా పవన్ వ్యాఖ్యలపై స్పందించారు.

mohan babu Counter On pawan kalyan
విష్ణుకు ఓటాయలని విజ్ఞప్తి.. mohan babu
సినీ పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు సినీ పెద్దలు మాట్లాడాల్సిన అవసరముందని పవన్ అన్నారు. ఈ సందర్భంగానే ఏపీ ప్రభుత్వంతో పాటు వైసీపీ మద్దతు దారు అయిన మోహన్ బాబుపై వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్స్ ఆన్‌లైన్ విక్రయాలకు ఓకే చెప్తే.. భవిష్యత్తులో సాయి విద్యానికేతన్‌లో సీట్లు కూడా ఏపీ సర్కారే ఆన్ లైన్‌లో భర్తీ చేస్తుందని, అది మీకు ఓకేనా? అని మోహన్‌బాబును పవన్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలకు మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మై డియర్ పవన్ కల్యాణ్ అంటూ పవన్ కల్యాణ్‌కు ట్యాగ్ చేసి ట్విట్టర్‌లో ఆ లేఖ రిలీజ్ చేశారు.
తన చిరకాల స్నేహితుడి సోదరుడైన పవన్ కల్యాణ్.. తనకంటే చిన్నవాడని అందుకే ఏకవచనంతో సంబోధిస్తున్నానని, అయితే, పవన్ కల్యాణ్ గారు అనడంలోనూ తప్పేమీ లేదని మోహన్ బాబు తెలిపారు. చాలా కాలానికి తనను మెల్లగా లాగావని, అయినా సంతోషమే.. ప్రజెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగుతున్నాయని, తన తనయుడు విష్ణు మా ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడన్న సంగతి నీకు తెలిసిందే కానీ గుర్తు చేస్తున్నానని చెప్పాడు. అక్టోబర్ 10న ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత నీవు అడిగిన ప్రతీ మాటకు ఆన్సర్ చెప్తానని మోహన్ బాబు తెలిపాడు.
ఈ లోగా నీవు చేయాల్సిన ముఖ్యమైన వర్క్ ఒకటుందని, నీ సోదర సమానుడైన విష్ణుకు ఓటు వేసి అతడిని, అతడి ప్యానెల్‌ను గెలిపించాలని కోరుతున్నానని మోహన్ బాబు పేర్కొన్నాడు. చివరగా లేఖలో మోహన్ బాబు థాంక్యూ వెరీ మచ్ అని రాశాడు. ఇకపోతే పవన్ కల్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ నేచురల్ స్టార్ నాని, టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ ట్వీట్స్ చేశారు. ఇద్దరు హీరోలు పవన్ కల్యాణ్‌కు థాంక్స్ చెప్పారు.