Nagarjuna : ఈ ఏడాది సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉంటాయని సినీ అభిమానులు ఆనందపడిపోయారు. కానీ, కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ పరిస్థితుల నేపథ్యంలో చిత్రాల విడుదల వాయిదా పడింది. ‘ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్’ రిలీజెస్ పోస్ట్ పోన్ అయ్యాయి. కాగా, ముందు అనుకున్న టైం ప్రకారంగా ఈ నెల 15న ‘బంగార్రాజు’ వచ్చేస్తున్నాడు. ఈ పిక్చర్ విడుదల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘ఆర్ఆర్ఆర్’ గురించి నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘బంగార్రాజు’ చిత్రం ఈ నెల 15న సంక్రాంతి కానుకగా అనుకున్న టైంకు విడుదల అవుతోంది. ఇందులో తండ్రీ తనయులు నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్నారు. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగచైతన్య సరసన హీరోయిన్‌గా ‘ఉప్పెన’భామ కృతి శెట్టి నటిస్తోంది. ఇకపోతే ఈ చిత్ర విడుదల సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న క్రమంలో నాగార్జున ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి మాట్లాడారు.పాన్ ఇండియా సినిమా అయిన ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ పోన్ అవడం బాధాకరమని, గతంలోనూ కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పిక్చర్ రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని గుర్తు చేశాడు.
సినిమా మేకర్స్ పడ్డ కష్టం గురించి తనకు వ్యక్తిగతంగా తెలుసని, అయితే, ఆ సినిమా ఇప్పుడు విడుదల కావాల్సినది కాదని నాగార్జున అన్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో విడుదలై ఈ చిత్రం సక్సెస్ కావాల్సిన అవసరం ఉందని నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘రాధే శ్యామ్’ కూడా పాన్ ఇండియా పిక్చర్ అని, అది కూడా విడుదల ఆలస్యం అవడం బాధాకరమని నాగార్జున పేర్కొన్నాడు. ఇకపోతే సంక్రాంతి కానుకగా ఈ సారి చిన్న సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ ఉండటం విశేషం. ఈ చిత్రంలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్ చేసింది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.