Nagarjuna : ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ పోన్ బాధాకరమన్న నాగార్జున..

Authored By mallesh | The Telugu News | Published on: January 7, 2022, 12:30 pm

Nagarjuna : ఈ ఏడాది సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉంటాయని సినీ అభిమానులు ఆనందపడిపోయారు. కానీ, కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ పరిస్థితుల నేపథ్యంలో చిత్రాల విడుదల వాయిదా పడింది. ‘ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్’ రిలీజెస్ పోస్ట్ పోన్ అయ్యాయి. కాగా, ముందు అనుకున్న టైం ప్రకారంగా ఈ నెల 15న ‘బంగార్రాజు’ వచ్చేస్తున్నాడు. ఈ పిక్చర్ విడుదల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘ఆర్ఆర్ఆర్’ గురించి నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘బంగార్రాజు’ చిత్రం ఈ నెల 15న సంక్రాంతి కానుకగా అనుకున్న టైంకు విడుదల అవుతోంది. ఇందులో తండ్రీ తనయులు నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్నారు. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగచైతన్య సరసన హీరోయిన్‌గా ‘ఉప్పెన’భామ కృతి శెట్టి నటిస్తోంది. ఇకపోతే ఈ చిత్ర విడుదల సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న క్రమంలో నాగార్జున ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి మాట్లాడారు.పాన్ ఇండియా సినిమా అయిన ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ పోన్ అవడం బాధాకరమని, గతంలోనూ కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పిక్చర్ రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని గుర్తు చేశాడు.

nagarjuna comments on rrr film post ponement

nagarjuna comments on rrr film post ponement

Nagarjuna : ఇప్పుడున్న పరిస్థితులు బాధాకరమన్న నాగార్జున..

సినిమా మేకర్స్ పడ్డ కష్టం గురించి తనకు వ్యక్తిగతంగా తెలుసని, అయితే, ఆ సినిమా ఇప్పుడు విడుదల కావాల్సినది కాదని నాగార్జున అన్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో విడుదలై ఈ చిత్రం సక్సెస్ కావాల్సిన అవసరం ఉందని నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘రాధే శ్యామ్’ కూడా పాన్ ఇండియా పిక్చర్ అని, అది కూడా విడుదల ఆలస్యం అవడం బాధాకరమని నాగార్జున పేర్కొన్నాడు. ఇకపోతే సంక్రాంతి కానుకగా ఈ సారి చిన్న సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ ఉండటం విశేషం. ఈ చిత్రంలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్ చేసింది.

mallesh

No bio available for this author.

  1. "YS Jagan YS Sharmila : షర్మిల కూతురి పెళ్లికి జగన్ ఇల్లు ఇవ్వలేదా? అసలు కారణంపై ఆసక్తికర చర్చ"

  2. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

  3. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

  4. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

  5. "Charlotte Telugu Sambaralu 2026 : షార్లెట్‌లో తెలుగు సంబరాలు 2026 ఘనంగా.. మిషిగన్‌లో నాట్స్ కొత్త చాప్టర్ ప్రారంభం"

  6. "NATS : అమెరికా తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం.. సాయి గంగులకు కీలక బాధ్యతలు"

  7. "Flipkart Big Billion Days : రూ.9 వేలలోపు ఫోన్లు.. 5Gపై అదిరే డీల్స్"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp