Viral Video : సో కూల్.. తాబేలు‌పై రైడ్‌కు వెళ్తున్న స్టైలిష్ కుందేలు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Video : సో కూల్.. తాబేలు‌పై రైడ్‌కు వెళ్తున్న స్టైలిష్ కుందేలు..!

Viral Videot : మనుషుల మధ్యే కాదు.. జంతువుల మధ్య కూడా ప్రేమ ఉంటుందనేందుకు ఈ వీడియో నిదర్శనం అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న ఈ వీడియోలో తాబేలు‌పై కుందేలు రైడ్‌కు వెళ్తోంది. కేవలం తొమ్మిది సెకన్లే ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియోలో తాబేలు స్లోగా నడుస్తుండగా దానిపైన కుందేలు హాయిగా కూర్చొని ఉంది. అయితే, కుందేలు గాగుల్స్ పెట్టుకుని కెమెరాకు స్టిల్స్ […]

 Authored By praveen | The Telugu News | Updated on :5 October 2021,1:15 pm

Viral Videot : మనుషుల మధ్యే కాదు.. జంతువుల మధ్య కూడా ప్రేమ ఉంటుందనేందుకు ఈ వీడియో నిదర్శనం అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న ఈ వీడియోలో తాబేలు‌పై కుందేలు రైడ్‌కు వెళ్తోంది. కేవలం తొమ్మిది సెకన్లే ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

rabbit tortoise riding Viral Video

rabbit tortoise riding Viral Video

నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియోలో తాబేలు స్లోగా నడుస్తుండగా దానిపైన కుందేలు హాయిగా కూర్చొని ఉంది. అయితే, కుందేలు గాగుల్స్ పెట్టుకుని కెమెరాకు స్టిల్స్ ఇస్తూ స్టైలిష్ లుక్ ఇస్తూ ఫోజు కొడుతుండటం విశేషం. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ శక్తి ఇదే నంటూ పేర్కొంటున్నారు.

Viral Video : తాబేలు, కుందేలు గుడ్ ఫ్రెండ్స్..

rabbit tortoise riding Viral Video

rabbit tortoise riding Viral Video

తాబేలు ఆలోచిస్తూ నడుస్తున్న క్రమంలో కుందేలు జీవిస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక చాలా మంది నెటిజన్లు ఈ వీడియో చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూల్‌గా బైక్‌పై రైడ్ కు వెళ్తున్న ఇద్దరు ఫ్రెండ్స్ మాదిరిగా ‘సో .. కూల్’గా కుందేలు, తాబేలు వెళ్తున్నాయని అనుకుంటున్నారు. ‘లవ్ పవర్’ అనే ట్విట్టర్ యూజర్ తన అకౌంట్‌లో ఈ వీడియోను ట్వీట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరలవుతోంది.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది