Home » Entertainment » Ram Charan 15th Project With Shankar
Entertainment

Ram Charan : అదే జరిగితే రచ్చ రచ్చే.. రామ్ చరణ్ ప్రాజెక్ట్‌లపై ట్విట్టర్ టాక్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: February 10, 2021, 8:07 pm
Advertisement

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా ఆచార్య చిత్రంలో ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. కానీ అది పూర్తి స్థాయి హీరోగా కాదు కాబట్టి ఎవ్వరూ లెక్కలోకి తీసుకోరు. అలా ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్‌లపై ఇంతవరకు ఎలాంటి సమచారాం రాలేదు. కేవలం ఊహాగానాలే వచ్చాయి. ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ కథలు చెప్పారు.. రామ్ చరణ్ విన్నాడంటూ టాక్ వచ్చింది.

Advertisement

అందులో ఎక్కువగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడని… గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథ కూడా చెర్రీకి బాగా నచ్చిందని ఆ మధ్య రూమర్లు బాగా వచ్చాయి.అయితే వీటిపై ఓ క్లారిటీ వచ్చేలానే ఉందని తెలుస్తోంది. త్వరలోనే రామ్ చరణ్ 15వ మూవీ అప్డేట్ రాబోతోందని ట్విట్టర్‌లో మోత మోగిపోతోంది. అయితే ఈ మేరకు దర్శకుడు ఎవరై ఉంటారా? అనే చర్చతో నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.

Ram charan 15th project with Shankar

Advertisement

Ram charan : రామ్ చరణ్ ప్రాజెక్ట్‌లపై ట్విట్టర్ టాక్

ఎక్కువ మంది మాత్రం రామ్ చరణ్ శంకర్ కాంబోలో సినిమా ఉంటుందని అంటున్నారు. దీంతో శంకర్ పేరు కూడా ట్విట్టర్‌లో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. అయితే గౌతమ్ తిన్ననూరితో కూడా ఓ మూవీ ఉండబోతోందని అంటున్నారు. కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ కాంబో గనుక ఫిక్స్ అయితే మాత్రం రచ్చ రచ్చగా ఉంటుందని తెలుస్తోంది. శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 పనుల్లో ఉన్నాడు. కానీ షూటింగ్ సెట్‌లో జరిగిన ప్రమాదం మూలానా ఈ మూవీ మూలకు పడేలా ఉంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి