Jobs in Telangana : రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదరుచూస్తున్నారు. అయితే, కేసీఆర్ సర్కార్ క్రమంగా ఒక్కో విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి దరఖాస్తు కోసం ఈ నెల 28వ తేదీని గడువుగా ప్రకటించారు.కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి సంబంధించి నియామకాలు జరుగుతున్నాయి. ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు చేపడుతున్నారు. జాగా రంగారెడ్డి జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
తా మొత్తం ఆరు స్టాఫ్ నర్సు ఖాళీలను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో చెప్పారు.ఈ నెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 28వ తేదీని అప్లికేషన్‌కు చివరి తేదిగా నిర్ణయించారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్‌ను వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని డీఎంహెచ్ఓ, రంగారెడ్డి అడ్రస్ కు పోస్టు చేయాలి. ఆరు స్టాఫ్ నర్సు ఖాళీలకు విద్యార్హతను బీఎస్సీ నర్సింగ్‌గా నిర్ణయించారు. వేతనం రూ.23వేలుగా నిర్ణయించారు. ఎక్స్‌పీరియన్స్ విషయానికొస్తే అభ్యర్థులు యాక్టీవ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఏజ్ విషయానికొస్తే అభ్యర్థులు 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు వయో పరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు ఎలా చేయాలంటే.. వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నాక.. విద్యార్హత సర్టిఫికేట్స్, యాక్టివ్ నర్సిగ్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్‌తో పాటు ఫొటో జతచేయాలి. ఓసీ, బీసీ క్యాండిడేట్స్ డీఎంహెచ్ఓ పేరిట రూ. 200 డీడీ తీసి అప్లికేషన్ ఫామ్‌కు జత చేయాలి. దరఖాస్తును ఈ నెల 28వ తేదీలోగా డీఎంహెచ్‌వో, శివరాంపల్లి, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, పిన్ 500052 చిరునామాకు పంపించాలి.
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
This website uses cookies.