Jobs in Telangana : నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో ఆ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jobs in Telangana : నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో ఆ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

 Authored By mallesh | The Telugu News | Updated on :26 October 2021,1:40 pm

Jobs in Telangana : రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదరుచూస్తున్నారు. అయితే, కేసీఆర్ సర్కార్ క్రమంగా ఒక్కో విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి దరఖాస్తు కోసం ఈ నెల 28వ తేదీని గడువుగా ప్రకటించారు.కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి సంబంధించి నియామకాలు జరుగుతున్నాయి. ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు చేపడుతున్నారు. జాగా రంగారెడ్డి జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

telangana notification released

telangana notification released

తా మొత్తం ఆరు స్టాఫ్ నర్సు ఖాళీలను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో చెప్పారు.ఈ నెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 28వ తేదీని అప్లికేషన్‌కు చివరి తేదిగా నిర్ణయించారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్‌ను వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని డీఎంహెచ్ఓ, రంగారెడ్డి అడ్రస్‌ కు పోస్టు చేయాలి. ఆరు స్టాఫ్ నర్సు ఖాళీలకు విద్యార్హతను బీఎస్సీ నర్సింగ్‌గా నిర్ణయించారు. వేతనం రూ.23వేలుగా నిర్ణయించారు. ఎక్స్‌పీరియన్స్ విషయానికొస్తే అభ్యర్థులు యాక్టీవ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఏజ్ విషయానికొస్తే అభ్యర్థులు 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు వయో పరిమితిలో సడలింపు ఉంది.

Jobs in Telangana : ఆరోగ్య విభాగంలో ఖాళీలు..

దరఖాస్తు ఎలా చేయాలంటే.. వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నాక.. విద్యార్హత సర్టిఫికేట్స్, యాక్టివ్ నర్సిగ్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్‌తో పాటు ఫొటో జతచేయాలి. ఓసీ, బీసీ క్యాండిడేట్స్ డీఎంహెచ్ఓ పేరిట రూ. 200 డీడీ తీసి అప్లికేషన్ ఫామ్‌కు జత చేయాలి. దరఖాస్తును ఈ నెల 28వ తేదీలోగా డీఎంహెచ్‌వో, శివరాంపల్లి, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, పిన్ 500052 చిరునామాకు పంపించాలి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది