Viral Video : ఇదేం జ‌ర్నీ రా నాయ‌నా.. ఒక్క బైక్ మీద 13 మంది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Video : ఇదేం జ‌ర్నీ రా నాయ‌నా.. ఒక్క బైక్ మీద 13 మంది..!

journey..కొన్ని ఫ‌న్నీ వీడియోలు సోష‌ల్ మీడియాలో నిత్యం అబ్బుర‌ప‌రుస్తాయి. ఇవి నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటాయి. ఇవి ఆనందంతో పాటు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తాయి. సోష‌ల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసి చ‌క్క‌ర్లు కొడుతాయి. అలాంటిదే ఇక్కడ ఒక‌టి జ‌రిగింది. 13 మంది పిల్లలను ఓ వ్య‌క్తి తన బైకుపై 13 మంది పిల్ల‌ల‌ను ఎక్కించుకున్నాడు. అంతేగాక రోడ్డుపైకి వ‌చ్చారు. ఆ వ్య‌క్తి 13 మంది పిల్ల‌ల‌ను క‌న‌డ‌మే ఘోరం. దానికి వాళ్లంద‌రిని బైక్‌పై ఎక్కించుకొని ప్ర‌యాణం చేశాడు. ఇందులో ట్విస్టు […]

 Authored By praveen | The Telugu News | Updated on :16 September 2021,9:30 pm

journey..కొన్ని ఫ‌న్నీ వీడియోలు సోష‌ల్ మీడియాలో నిత్యం అబ్బుర‌ప‌రుస్తాయి. ఇవి నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటాయి. ఇవి ఆనందంతో పాటు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తాయి. సోష‌ల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసి చ‌క్క‌ర్లు కొడుతాయి. అలాంటిదే ఇక్కడ ఒక‌టి జ‌రిగింది. 13 మంది పిల్లలను ఓ వ్య‌క్తి తన బైకుపై 13 మంది పిల్ల‌ల‌ను ఎక్కించుకున్నాడు. అంతేగాక రోడ్డుపైకి వ‌చ్చారు. ఆ వ్య‌క్తి 13 మంది పిల్ల‌ల‌ను క‌న‌డ‌మే ఘోరం. దానికి వాళ్లంద‌రిని బైక్‌పై ఎక్కించుకొని ప్ర‌యాణం చేశాడు.

Viral Video 13 people on one bike

Viral Video 13 people on one bike

ఇందులో ట్విస్టు ఏమిటంటే 2 ఏండ్ల వయసు గ‌ల చిన్నారి కూడా ఉంది. ఆ మంది పదేళ్ల వయసు వారే కావడం గ‌మ‌నార్హం. బైక్ సీట్లపై, చక్రాలపై, ఇంకా ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ చిన్నారుల‌ను కూర్చోబెట్టాడు. ముందు చక్రంపై ఇద్ద‌రు, బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ఐదుగురు పిల్లలు, ఇంకా ఓ పిల్లాడు అయితే అతని భుజంపై కూర్చున్నాడు. కొంతమంది పిల్లల అయితే వేలాడుత‌న్న‌ట్లు క‌నిపిస్తున్నారు. వారంద‌రినీ బైక్‌పై కూర్చోబెట్టుకొని సంతోషంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ పిల్లలు సైతం పాటలు పాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Viral Video 13 people on one bike

Viral Video 13 people on one bike

స‌ర్క‌స్‌లో మాద‌రిగా స్టంట్స్ చేస్తున్న‌ట్టుగా ఉంది వారి ప్ర‌యాణం. అయితే ఎవ‌రికీ ఏమి కాక‌పోతే ఏమి కాదు, ఒక‌వేళ ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే ఎవ‌రూ దీనికి బాధ్యులు అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. కానీ ఈ వీడియోకు మాత్రం లైక్స్, కామెంట్స్ తెగ పెడుతున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం ఆ వ్య‌క్తిపై తిడుతూనే కామెంట్లు పెడుతున్నారు. పిల్ల‌ల‌తో అలాంటి రిస్కులు చేయొద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది