Pawan Kalyan : పవన్ కళ్యాన్ తో టచ్‌లో ఆ నేతలు.. జనసేనలో చేరేది ఎప్పుడంటే?
pawan kalyan : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోని వస్తుందని ఆయన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కేడర్‌లో భరోసా నింపేందుకే ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారని అనుకున్నారంతా.. కానీ ఆయన ప్రయత్నాలు సైతం ఆ వైపుగానే కొనసాగుతున్నాయి.
పార్టీలో అన్ని కులాలకు ప్రియారిటీ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తున్నది. పార్టీపై పడ్డ కులముద్రను తొలగించాలని ఆయన ఆలోచిస్తున్నారని సమాచారం. 2019 ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాల నుండి సపోర్ట్ లేకపోవడం వల్లే తన పార్టీ ఓటమి పాలైందని భావిస్తున్నారట జనసేనాని. భీమవరంలో తనకు సపోర్టుగా చెంత రాజుల సామాజిక వర్గానికి చెందిన నాయకులు లేకపోవడాన్ని గ్రహించారయన. ఈ క్రమంలో రాజులతో పాటుగా మిగతా సామాజిక వర్గాలను సైతం పార్టీలోకి ఆహ్వానించి వారికి కీలక పదవులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
Pawan Kalyan : ఉత్తరాంధ్రపై పట్టుకోసమేనా?
ఇందులో భాగంగానే ఉత్తరాంధ్రలో బీజేపీ లీడర్ విష్ణుకుమార్ రాజును జనసేనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. విష్ణు విశాఖ ఉత్తరం స్థానం నుంచి 2014 ఎలక్షన్స్‌లో విజయం సాధించారు. జనసేనలో విష్ణు చేరితే ఆయనతో అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు సైతం పార్టీలోకి వచ్చే చాన్స్ ఉందని పవన్ భావిస్తున్నారు. విష్ణుతో పాటు మరి కొందరు నేతలతో జనసేన లీడర్స్ ఇప్పటికే టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఒక వేళ విష్ణు పార్టీలో చేరితే ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు పవన్. విష్ణుతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సైతం పవన్ ఆధ్వర్యంలో దసరా తర్వాత పార్టీలో చేరే చాన్స్ ఉంది. అయితే ఇందులో బీజేపీ, టీడీపీకి చెందిన నేతలు సైతం ఉండనున్నారని తెలుస్తున్నది.