YS Jagan : ఇప్పుడు జగన్ ముందున్న అతిపెద్ద టాస్క్ అదే.. దాన్ని పూర్తిచేయగలిగితేనే జగన్‌ను జనాలు నమ్మేది?
YS Jagan :2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనమే సృష్టించిన సంగతి అందరికీ విదితమే. భారీ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే జగన్ మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరితేనే ప్రజలకు ఆయనకు మళ్లీ అవకాశం ఇస్తారని పలువురు అంటున్నారు. అయితే, జగన్ పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది కల్లా పూర్తి చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏపీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. మెఘా ఇంజినీరింగ్ కంపెనీపైన జగన్ నమ్మకం పెట్టుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రాజెక్టను సత్వరమే పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును జగన్ ఫాదర్ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించగా, అప్పటి నుంచి పనులు సాగు..తూనే ఉన్నాయి. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో 70 శాతం పనులు పూర్తి చేసినట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే, అవి ఉట్టి మాటలేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు నేతలు ఇంకో అడుగు ముందుకేసి పోలవరం పూర్తి చేయకపోవడం వల్లే చంద్రబాబుకు ఈ గతి పట్టిందని, ఘోర పరాజయం చెందారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందున్న అతి పెద్ద టాస్క్ పోలవరం అని తెలుస్తోంది. 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానని జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడా వానాకాలం నాటికి నీళ్లు అందించే విషయమై కూడా జగన్ హామీ ఇచ్చారు. పనులు చాలా వేగవంతంగా జరిగితే తప్ప అప్పటి వరకు నీళ్లు అందుతాయనేది కొందరి అభిప్రాయం.
YS Jagan : వచ్చే ఎన్నికల్లో ఇదే కీలకం..
పోలవరం ప్రాజెక్టు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అధికారుల పరిశీలనతో పాటు వైసీపీ నేతలు కూడా చూడాల్సి ఉంటుందని మరి కొందరు చెప్తున్నారు. కేంద్రప్రభుత్వం నిధులు కూడా అవసరం కాగా వాటి కోసం ఏపీ రాష్ట్రసర్కారు స్పెషల్ అధికారుల బృందాలనూ నియమించింది. వారూ పోలవరం ప్రాజెక్టు ఫైల్స్ క్లియరెన్స్ కోసం ఢిల్లీలో వివరణ ఇస్తున్నారు కూడా. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి జగన్ పూర్తి చేయగలడా? లేదా ? అనేది ప్రజెంట్ హాట్ టాపిక్‌గా ఉంది.