ys jagan : మరోసారి గెలిచేందుకు జగన్ ప్లాన్.. రంగంలోకి పీకే టీం.. ఆ నేతకే కీలక బాధ్యతలు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ys jagan : మరోసారి గెలిచేందుకు జగన్ ప్లాన్.. రంగంలోకి పీకే టీం.. ఆ నేతకే కీలక బాధ్యతలు..

 Authored By mallesh | The Telugu News | Updated on :28 October 2021,3:20 pm

ys jagan : ఏపీ సీఎం జగన్ పవర్‌లోకి వచ్చాక ఎప్పటికప్పుడు తన మార్క్‌ను చూపించుకుంటూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను అట్రాక్ట్ చేస్తూ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. ప్రతిపక్షాలను సున్నితంగా విమర్శిస్తూనే పాలన వైపు ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన తన పదవిని పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు. అందుకోసం ఏ చిన్న చాయిస్‌ను సైతం వదులుకోవడం లేదు. ఇక ఆయా కాన్స్‌టెన్సీలలో ఎమ్మెల్యేల పనితీరు పేరుకు మాత్రమే పరిమితమైంది. అయితే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మాత్రమే గెలుపునకు సరిపోవు. రియాలిటీ కోసం క్షత్రస్థాయిలో పరిశీలనలు చేయాలి.

ys jagan

ys jagan

అలా చేయాలని ఉన్నా.. పార్టీ లీడర్లు, అధికారులపై డిపెండ్ కావాలి. వారిచ్చే రిపోర్ట్‌లు విశ్వసనీయంగా ఉన్నాయా? లేదా? అన్నదే తలెత్తుతున్న క్వశ్చన్. అందు కోసమే ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉండగానే ప్రశాంత్ కిషోర్ టీంను రంగంలోకి దింపుతున్నారు సీఎం జగన్. ఇప్పుడు మొదలు పెడితే పీకే టీం సెట్ అవ్వడానికి సుమారు ఆరు నెలలు పట్టొచ్చు. తర్వాత రెండు సంవత్సరాల టైంలో పీకే టీం ఇచ్చిన నివేదికల ఆధారంగా మూవ్ కావాలని జగన్ ప్లాన్..గత ఎలక్షన్స్ టైంకి ముందు సైతం జగన్ పీకే టీం చెప్పినట్టే చేశారు. సుమారు మూడు సంవత్సరాలకు ముందే ప్రశాంత్ కిషోర్‌ను ఎలక్షన్స్ వ్యూహకర్తగా నియమించుకున్నారు జగన్. ఆ

ys jagan : కీలక నేతకు సమన్వయ బాధ్యతలు

Ysrcp

Ysrcp

టీం చెప్పిన విషయాలకు జగన్ ఫాలో అయ్యారు. క్యాండిడేట్స్‌ను సెలెక్ట్ చేయడంలోనూ కొన్ని నియోజకవర్గాలు మినహా అన్నింటిలో టీం నివేదికలనే ఆధారంగా చేసుకున్నారు. ఇక ప్రస్తుతం వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్‌కు సైతం ఇదే తీరులో ముందుకు వెళ్లనున్నారు. ప్రస్తుతం పీకే టీంతో సమన్వయ బాధ్యతను తన పార్టీలోని ఓ కీలక లీడర్‌కు అప్పగిస్తున్నారు. టీం ఇచ్చే రిపోర్టులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ.. తనకు తెలిపేందుకు అరెంజ్‌మెంట్స్ చేసుకున్నారు జగన్. మెయిన్‌గా విపక్షాలు ప్రభుత్వంపై ఆధారం లేకుండా చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా పీకే టీం పనిచేస్తుంది. సోషల్ మీడియా బాధ్యతలు సైతం టీంకే అప్పగించనున్నారని టాక్. మొత్తానికి మరోసారి గెలిచేందుకు ఇప్పటి నుంచి జగన్ ముందస్తు ప్లానింగ్ చేసుకుంటున్నారు.

 

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది